సావిత్రి గారి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి సౌందర్య అనే చెప్పాలి. కన్నడ పరిశ్రమకు చెందిన అమ్మాయే అయినప్పటికీ తెలుగమ్మాయి అనేంతలా ఈమె గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలే చేయాలి, స్టార్ హీరోల సినిమాలోని నటించాలి అనే పద్ధతిని ఈమె పూర్తిగా మార్చేసింది.
ఈమె ఎంత స్టార్ డం సంపాదించుకున్న చిన్న హీరోలు అలాగే మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటించడానికి ఇన్ సెక్యూర్ గా ఫీల్ అయ్యేది కాదు. అందుకే ఈమె గురించి అప్పటి దర్శకనిర్మాతలు చాలా గొప్పగా చెబుతుంటారు. అలాంటి ఈ స్టార్ హీరోయిన్ రఘు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగిన సంవత్సరానికే హెలికాప్టర్ యాక్సిడెంట్ లో మరణించి అభిమానులకు, సినీ ఇండస్ట్రీకి తీరని శ్లోకాన్ని మిగిల్చింది.
ఆ తర్వాత సౌందర్య ఆస్తులపై ఎన్నో గొడవలు జరిగాయి. సొంత కుటుంబీకులే ఆస్తుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. అయితే కొద్ది కాలానికి రాజీకి వచ్చి ఆస్తిపంచుకున్నారు. అయితే సౌందర్య పెళ్లి అయిన సమయంలోనే ఆమె ఆస్తిని అంతా భర్త రఘు పేరు మీద రాసింది. ఇక ఆమె ఆస్తితో మరొక మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అపూర్వ. రెండో పెళ్లి చేసుకుని గోవాలో స్థిరపడ్డాడు. సౌందర్య ఉన్నంతకాలం ఎంతో మంది పేదలకు సాయం చేసింది. ఆమె పుట్టి పెరిగిన ఊరుకు మంచి పేరు తీసుకొచ్చింది.