వినోదం

ప‌వ‌న్ క‌ల్యాణ్ చేయాల్సిన ఒక్క‌డు మూవీ.. మ‌హేష్ చేతుల్లోకి ఎలా వెళ్లింది..?

సినిమా చూస్తున్నంతసేపు అభిమానుల్లో తెలియని ఉత్సాహం.. ప్రతీ సీన్‌కు విజిల్ వేయాలనిపించే ఎలివేషన్స్.. తమ హీరోను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించే సీన్స్.. మహేష్ బాబు అంటే అప్పటివరకు ఒక లవర్ బాయ్‌గానే చాలామందికి తెలుసు. అలాంటి టైమ్‌లో వచ్చింది ఒక్కడు. మహేష్ క్లాస్‌తో పాటు మాస్ కూడా చించేయగలడని నిరూపించింది. గుణ‌శేఖ‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో మ‌హేష్ కు జోడీగా భూమిక హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాతో భూమిక‌కు కూడా మంచి గుర్తింపు వ‌చ్చింది. ఒక్కడు 2003 జ‌న‌వ‌రి 15న విడుద‌లైంది.

ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్ విల‌నిజం మ‌హేష్ బాబు హీరోయిజం హైలెట్ గా నిలిచాయి. క‌బ‌డ్డి బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చిన ఈ సినిమా యూత్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అప్ప‌టికి మ‌హేష్ బాబు మురారి సినిమా విడుద‌ల కాలేదు. రాజ‌కుమారుడు సినిమా మాత్రం హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం కథా ర‌చ‌యిత వెల్ల‌డించారు. నిర్మాత ఎంఎస్ రాజు మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు వెళ్లిన‌ప్పుడు ఒక్క‌డు క‌థ‌ను కూడా వినిపించార‌ట‌. మ‌హేష్ ఒక్క‌డు క‌థ న‌చ్చి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌.

pawan kalyan is the first choice for okkadu movie

అయితే అప్ప‌ట్లో మ‌హేష్ బాబుకు శాక‌మూరి రాంబాబు అనే మేనేజర్ ఉండేవార‌ట‌. గుణ‌శేఖ‌ర్ ఒక్క‌డు సినిమా కోసం మ‌హేష్ బాబును సంప్ర‌దించే స‌మ‌యంలో మేనేజ‌ర్ ఫోన్ తీసేవారు కాద‌ట‌. లేదంటే బాబు ప‌డుకున్నారు అంటూ ఏదో ఒక రీజ‌న్ చెప్పేవార‌ట‌. దాంతో మ‌హేష్ బాబు సినిమా చేస్తారా ఆయ‌న‌కు ఆస‌క్తి ఉందా లేదా అని మేక‌ర్స్ డైల‌మాలో ప‌డిపోయార‌ట‌. త‌ర‌వాత ఇదే క‌థను ప‌వన్ క‌ల్యాణ్ లేదా వెంక‌టేష్ ల‌తో చేస్తే ఎలా ఉంటుంద‌ని ఆలోచ‌న చేశార‌ట‌. అలా డైలమాలో ఉన్న స‌మ‌యంలోనే మ‌హేష్ బాబు ఫోన్ చేసి ఒక్క‌డు తానే చేస్తాన‌ని చెప్పార‌ట‌.

Admin

Recent Posts