Off Beat

Offbeat : ర‌హ‌దారుల ప‌క్క‌న చెట్ల‌కు తెలుపు, ఎరుపు రంగు పెయింట్‌ల‌ను ఎందుకు వేస్తారో తెలుసా ?

Offbeat : ర‌హ‌దారుల‌పై మ‌నం ప్ర‌యాణించేట‌ప్పుడు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. వాటి ప‌క్క‌న ఉండే చెట్ల‌ను చూస్తుంటే మన‌స్సుకు ఎంతో ఆహ్లాదం క‌లుగుతుంది. అందుక‌నే చాలా మంది ప్ర‌యాణాల‌ను చేయ‌డాన్ని ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే ర‌హ‌దారుల ప‌క్క‌న ఉండే చెట్ల‌కు చాలా చోట్ల కింది భాగంలో తెలుపు.. దాని మీద పైభాగంలో కొద్దిగా ఎరుపు రంగు పెయింట్ల‌ను వేస్తారు. చూశారు క‌దా. ఇలా ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

చెట్ల‌కు ఇలా తెలుపు, ఎరుపు రంగు పెయింట్ల‌ను వేశారంటే.. అవి అట‌వీ శాఖ ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని అర్థం. అంటే వాటిని ఆ శాఖ అధికారులు ప్ర‌త్యేకంగా ర‌క్షిస్తార‌న్న‌మాట‌. అలాంటి చెట్ల‌ను చిన్న కొమ్మ న‌రికినా వారు చ‌ట్ట ప‌రంగా బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటారు. అందుక‌నే అలా చెట్ల‌కు పెయింట్ల‌ను వేస్తారు. ఇక తెలుపు రంగు పెయింటే ఎందుకంటే.. రాత్రి పూట కూడా చెట్లు సుల‌భంగా క‌నిపించాల‌ని చెప్పి అలా తెలుపు రంగు పెయింట్‌ను కింది భాగంలో వేస్తారు.

why white paint to trees beside roads

ఇక చెట్టు కింది భాగం నుంచి పైన కొంత భాగం వ‌ర‌కు మాత్ర‌మే ఎందుకు పెయింట్ల‌ను వేస్తారు అంటే.. భూమిలోంచి కీట‌కాలు, పురుగులు చెట్టు ఎక్కి పాడు చేయ‌కుండా ఉంటాయ‌ని చెట్టు కింది భాగం నుంచి మొద‌లుపెట్టి పైన కొంత వ‌ర‌కు పెయింట్ వేసి వ‌దిలేస్తారు. ఇలా పెయింట్ వేయ‌డం వ‌ల్ల కీట‌కాలు, పురుగుల బారిన ప‌డ‌కుండా చెట్లు సుర‌క్షితంగా ఉంటాయి.

ఇక చెట్ల‌కు ఇలా పెయింట్ వ‌ల్ల వాటి ఆయుర్దాయం పెరుగుతుంద‌ట‌. త్వ‌ర‌గా దెబ్బ‌తిన‌కుండా ఉంటాయి. అందుక‌నే వాటికి ఇలా పెయింట్స్ వేస్తుంటారు.

Admin

Recent Posts