సౌత్ సినిమాల స్థాయి పెరిగింది. మన సినిమాలపై బాలీవుడ్ కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుంది. సీక్వెల్స్ అంటే చాలు పిచ్చెక్కిపోతున్నారు నార్త్ ఆడియన్స్. అందుకే వాటి బిజినెస్ రేంజ్.. వచ్చే కలెక్షన్లు కూడా అలాగే ఉన్నాయి. అప్పట్లో బాహుబలి 2 అయినా.. మొన్నామధ్య కేజియఫ్ 2 అయినా.. ఇప్పుడు పుష్ప 2 అయినా.. అన్నింటికీ ఒకే సెంటిమెంట్ పని చేస్తుంది. నేషనల్ అవార్డు విన్నర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కి ఎదగగా, ఇప్పుడు ఆయన పుష్ప2 అనే చిత్రాన్ని చేస్తున్నాడు.సుకుమార్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమాని డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నారు
ఈ మూవీ రిలీజ్‌కు ముందే కలెక్షన్లలో కొత్త రికార్డును సృష్టించింది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా, ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో రూ.1,000 కోట్లకు పైగా సంపాదించింది. తద్వారా భారతీయ సినిమా చరిత్రలో రూ.1,000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మొదటి చిత్రంగా ‘పుష్ప: ది రూల్’ నిలిచింది. ఈ సినిమా అనూహ్యంగా రూ. కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే 1,085 కోట్లు రాటటింది. థియేట్రికల్ రైట్స్ రూ. 640 కోట్లు, రూ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి 220 కోట్లు, రూ. ఉత్తర భారతదేశం నుండి 200 కోట్లు, మరియు రూ. ఓవర్సీస్ మార్కెట్ల నుండి 140 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ రైట్స్‌ను రూ.120 కోట్లకు సేల్ చేశారు. థియేట్రికల్ రైట్స్ అమ్మడం ద్వారా మొత్తంగా రూ.640 కోట్లు వచ్చాయి. రూ.275 కోట్లతో పుష్ప 2 డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లు, టీవీ హక్కులను రూ.85 కోట్లకు విక్రయించారు. సుకుమార్ దర్శకుడిగా ఈ సినిమాని రూ.500 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో పలు భాషలకి సంబంధించిన నటీనటులు కూడా ఉన్నారు. కేశవగా జగదీప్ ప్రతాప్ బండారి, మంగళం శ్రీనుగా సునీల్, దాక్షాయణిగా అనసూయ భరద్వాజ్, ఎంపీ భూమిరెడ్డి సిద్దప్ప నాయుడుగా రావు రమేష్, జాలిరెడ్డిగా కన్నడ స్టార్ ధనంజయ నటిస్తున్నారు. అంతేకాకుండా, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. “పుష్ప: ది రూల్” సినిమాను నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ తమ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సీక్వెల్ కూడా బంపర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.