వినోదం

Sitara Ghattamaneni : మ‌హేష్ కుమార్తె సితార‌కు ఇష్ట‌మైన హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Sitara Ghattamaneni : మ‌హేష్ బాబు ముద్దుల త‌న‌య సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌కుండానే అశేష‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. చిన్న‌ప్ప‌టి నుండే త‌న‌లోని టాలెంట్‌ని మెల్ల‌గా బ‌య‌ట‌పెడుతూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. సితార త‌న తండ్రికి సంబంధించిన సినిమాల‌లోని పాట‌లు పాడ‌డం, డ్యాన్స్‌లు చేయ‌డంతో బాగా పాపుల‌ర్ అయింది. ఇటీవ‌ల పెన్నీ ప్రమోషనల్ సాంగ్‌లో సితార నటించి మెప్పించిన విష‌యం తెలిసిందే. సితార ప‌ర్‌ఫార్మెన్స్‌కి చాలా మంది ఫిదా అయ్యారు. ఫ్యూచ‌ర్ స్టార్ హీరోయిన్ అని జోస్యాలు కూడా చెప్పుకొచ్చారు.

మ‌హేష్ న‌టించిన స‌ర్కారు వారి పాట చిత్రాంతో సితార ప్ర‌త్య‌క్షంగానో, ప‌రోక్షంగానో క‌నెక్ట్ అయింది. ఈ క్ర‌మంలో ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లోను పాల్గొంది. అయితే ఓ సారి సితారకు మహేష్ బాబుతో పని చేసిన హీరోయిన్లకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. సమంత, రష్మిక మందనల గురించి చెప్పమని సితారను అడిగితే.. క్యూట్‌గా సమాధానం చెప్పేసింది. ఇప్పుడున్న హీరోయిన్స్ లో సమంత ఆంటీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. సెట్‌లోకి వచ్చినప్పుడు నాతోనే ఉంటుంది.. ఆడుతూ ఉంటుంది.. ప్లే ఫుల్ అని సమంత గురించి సితార చెప్పేసింది.

Sitara Ghattamaneni favorite heroine

ఇక.. సమంత‌కి కూడా సితార అంటే స్పెషల్ ఇంట్రెస్ట్. సితార క్యూట్ నెస్ గురించి, తన తెలివితేటల సామ్ గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సామ్- సితార మధ్య మంచి బాండింగ్ బిల్డ్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే సితార గురించి ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన మ‌హేష్‌.. తన కూతురు పెద్ద హీరోయిన్ అవుతుందని అన్నారు. అయితే తమ పిల్లలు సినిమా రంగంలోకి రావాలంటే తాను అడ్డు చెప్ప‌నన్నారు. సితార ఫస్ట్ మూవీపై స్పందించేందుకు మాత్రం మహేష్ నిరాకరించారు.

Admin

Recent Posts