Flowers For Pooja : ప్రతి ఒక్కరు కూడా రోజూ పూజ చేస్తూ ఉంటారు. దీపం పెట్టడం, దేవుడికి పూలు పెట్టి పూజ చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే. వీటిని ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి. పూజ చేసేశాం కదా అని కాకుండా భక్తితో, శ్రద్ధతో పూజ చేసుకోవాలి. అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా ముఖ్యమైన విషయమే.
ఏ పూలతో పూజ చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. భగవంతుడిని ఆరాధించేటప్పుడు పూలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తి పూర్వకంగా పూలను పెడుతూ ఉంటాము. అలాగే స్వామి వారి పాదాల కింద పూలను తీసుకుని కళ్ళకి అద్దుకుని ప్రత్యేకంగా చూస్తాము. కొన్ని పూలు పూజకి అస్సలు పనికిరావు. ఏ పూలతో పూజ చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం.
మొగలి పువ్వుతో పూజలు చేయకూడదు. మొగలి పువ్వుతో పూజ చేస్తే మంచి ఫలితం ఉండదు. ఆ వాసనకి పాములు తిరుగుతూ ఉంటాయట. కాబట్టి మొగలిపూలని పూజకి వాడకండి. బంతి పూలను కూడా పూజకి వాడకూడదు. క్రిమి కీటకాలని ఆకర్షించి నాశనం చేసే శక్తి వీటికి ఉంది. బంతిపూలను దేవుడికి పెట్టకుండా చూసుకోండి. అలాగే ఎటువంటి వాసన లేని పూలని, ఘాటైన వాసన కలిగిన పూలని కూడా దేవుడికి పెట్టకూడదు.
పూజ చేసేటప్పుడు మధ్య వేలు, ఉంగరపు వేలుతో పువ్వులని పెట్టాలి. ముళ్ళు ఉండే పూలని, రేకలు తెగిన పూలని కూడా పూజకి పెట్టకూడదు. అలాగే వాడిపోయిన పువ్వులను అస్సలు పెట్టకండి. వాడిపోయిన పూలను వెంటనే తొలగించాలి. వినాయకుడికి ఎర్రటి పూలు పెడితే మంచిది. లక్ష్మీదేవికి కలువ పూలు అంటే ఇష్టం. పసుపు పూలతో సరస్వతి దేవికి పూజిస్తే మంచి జరుగుతుంది. శివుడిని పూజించేటప్పుడు ఉమ్మెత్త పువ్వులని ఉపయోగించండి. హనుమంతుడికి మల్లెపూలు ఇష్టం. మల్లెపూలతో హనుమంతుడిని ఆరాధించండి.