వినోదం

Sr NTR : సిగ‌రెట్ కోసం షూటింగ్ మానేసిన ఎన్టీఆర్.. ఎందుకంత మొండి చేశారు..?

Sr NTR : సీనియర్ ఎన్టీఆర్ ప‌ని విష‌యంలో చాలా స్ట్రిక్ట్ అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. డిసిప్లెయిన్‌గా ఎవ‌రైన లేక‌పోతే వారికి మాములు క్లాస్ పీక‌రు. అయితే 1960లో వ‌చ్చిన గుడిగంట‌లు మూవీ షూటింగ్ స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ సినిమాకు నిర్మాత డూండీ, వి.మ‌ధుసూద‌న్ రావు ద‌ర్శ‌కుడు. ఇందులో ఎన్టీఆర్ పాత్ర సిగ‌రెట్ తాగుతూ ఉంటుంది. సాధార‌ణంగా ఎన్టీఆర్‌కి సిగ‌రెట్ కాల్చే అల‌వాటు లేదు. సినిమాలో పాత్ర ఉంటే మాత్రం రోజుకు రెండు డ‌బ్బాల‌ స్టేట్ ఎక్స్‌ప్రెస్ సిగ‌రేట్ లే కాల్చేవారు. గుడిగంట‌లు స్కెడ్యూల్ లో ఆయ‌న కోసం రోజు రెండు డ‌బ్బాల స్టేట్ ఎక్స్‌ప్రెస్ ప్రాన్ సిగ‌రేట్ లు తెప్పించి రెడీగా ఉంచేవారు.

ఇవి ఫారెన్ సిగ‌రేట్స్ కాగా, ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దొరికేవి కాదు. ఓ రోజు మ‌ధ్యాహ్నం భోజ‌నాలు అయ్యాయి. ఎన్టీఆర్ సెట్ లో ఉన్నాడు . నిర్మాత డూండీ ఎన్టీఆర్ కోసం తెప్పించిన డ‌బ్బా సీల్ తీశారు. అది ఇలా తీసి అలా ప‌డేశారు. మ‌రో డ‌బ్బా కోసం క‌బురు పంప‌గా, అది బాయ్ తెచ్చి ఇచ్చాడు. అది చూసి ఎన్టీఆర్ కోపోద్రిక్తుడ‌య్యాడు. అందుకు కార‌ణం దాని సీల్ తీసి ఉండ‌డం. ఎన్టీఆర్ కోపాన్ని డూండీ లైట్ తీసుకున్నారు. అయితే త‌న‌కు ఫుల్ సిగ‌రెట్ డ‌బ్బా ఇస్తేనే సెట్‌కి వ‌స్తానంటున్నారు అని బాయ్ నిర్మాత‌కి చెప్పాడు. గొడ‌వెందుకు అని మ‌ద్రాస్‌లో ఎక్క‌డున్నా స‌రే అర్జెంట్‌గా ఓ సిగ‌రేట్ డ‌బ్బా తీసుకురాపో అని నిర్మాత బాయ్‌ని పంపాడు.

sr ntr stopped shooting for that movie know what happened

అయితే ఎప్పుడు తెచ్చే షాప్‌లో స్టాక్ అయిపోయింది. ఎక్కడ దొరుకుతాయి అని అత‌న్నే అడ‌గ‌గా ఆరు మైళ్ల దూరంలో ఉంటాయ‌ని అన్నాడ‌ట‌.ఇక చేసేదేం లేక అలానే వెళ్లారు. కొత్త సిగ‌రేట్ డ‌బ్బా తీసుకొచ్చే స‌రికి టైమ్ 4 అయింది. ఎన్టీఆర్ మేక‌ప్ రూమ్ నుంచి సెట్ లోకి రాలేదు. షూటింగ్ జ‌ర‌గ‌లేదు. ఆయ‌న కోపాన్ని గ‌మ‌నించిన‌ నిర్మాత డూండీతో పాటు ర‌మ‌ణ కూడా ఎన్టీఆర్‌కు సారీ చెప్పారు. సిగ‌రేట్ కోసం కాదు బ్ర‌ద‌ర్ డిసిప్లీన్ ముఖ్యం. ఆ ప్రిన్సిప‌ల్‌కు నేను కూడా అతీతుడిని కాద‌ని చెప్పి సెట్‌లోకి వ‌చ్చారు ఎన్టీఆర్.

Admin

Recent Posts