వినోదం

Bharat Ane Nenu : భ‌ర‌త్ అనే నేను మూవీలో తొల‌గించిన సీన్ ఇదే.. దీన్ని పెట్టి ఉంటే సినిమా ఫ్లాప్ అయి ఉండేది..!?

Bharat Ane Nenu : మ‌హేష్ బాబు ఈ మ‌ధ్య కాలంలో న‌టించిన సినిమాల‌న్నీ సోష‌ల్ మెసేజ్‌ను ఇచ్చిన మూవీలే. వాటిల్లో భ‌ర‌త్ అనే నేను మూవీ ఒక‌టి. ఇందులో మ‌హేష్ సీఎంగా క‌నిపించి అల‌రించారు. భ‌ర‌త్ అనే నేను హిట్ టాక్ తో క‌లెక్ష‌న్ల వ‌ర‌ద పారించింది. పొలిటిక‌ల్ క‌థాంశంతో తీసిన ఈ సినిమాలో ముఖ్య‌మంత్రి పాత్ర‌లో జీవించాడు మ‌హేష్ బాబు. అయితే అన్ని సినిమాల్లాగే ఈ మూవీలోనూ కొన్ని సీన్ల‌ను తొల‌గించారు. అందుకు అనేక కార‌ణాలు ఉన్నాయి.

ప్రైవేట్ స్కూల్స్ బాగోతం, బ‌డ్జెట్, వ్య‌వ‌సాయం, గ‌ర్భ‌వ‌తి మ‌హిళ‌. ఈ నాలుగు అంశాల‌కు సంబంధించిన వీడియోలో మొద‌టి మూడు సంద‌ర్భాల సీన్ లు సూప‌ర్ గాఉన్నాయి. కానీ 4వ‌ సీన్ సినిమాలో ఉండుంటే మాత్రం పెద్ద వివాదానికి కేంద్ర బిందువు అయ్యేది కావ‌చ్చు. దీని వ‌ల్ల సినిమా ఫ్లాప్ అయి ఉండేద‌ని అప్ప‌ట్లో అన్నారు. ఇంత‌కీ అస‌లు ఆ సీన్ ఏమిటంటే..

bharat ane nenu movie deleted scene have you watched this

గ్రామ‌స్తుల‌ స‌మ‌స్య‌లను విన‌డానికి ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కి వ‌చ్చిన భ‌ర‌త్ ఓ గ‌ర్భ‌వ‌తి మ‌హిళ‌ను చూసి ఎంతమంద‌మ్మా పిల్ల‌లు ? అని అడుగుతాడు. దానికామె ముగ్గురండీ, ఇది నాల్గ‌వ‌ది అని త‌న గ‌ర్భాన్ని చూపిస్తుంది. దానికి రియాక్టైన సీఎం.. అంత‌మందిని పోషించి, చ‌దివించే స్థోమ‌త ఉందా..? అని అడిగి.. మ‌గాడికి లేదు మీక‌న్నా ఉండొద్దు బుద్ది అని అక్క‌డి నుండి వెళ్ళిపోతాడు. ఒక‌వేళ ఈ సీన్ సినిమాలో ఉండి ఉండుంటే పెద్ద వివాదానికి కేంద్ర బిందువు అయి ఉండేది. నిజానికి ఈ సీన్ అస‌లు ఏమీ బాగా లేదు. అందువ‌ల్లే దీన్ని తొల‌గించార‌ని అనుకోవ‌చ్చు. ఈ సీన్‌ను గ‌న‌క పెట్టి ఉంటే సినిమా ఫ్లాప్ అయి ఉండేద‌ని కూడా అప్ప‌ట్లో చాలా మంది అన్నారు. అయితే ఈ సీన్ లేదు కాబ‌ట్టి మూవీ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది.

Admin

Recent Posts