వినోదం

Sundarakanda Aparna : సుంద‌ర‌కాండ అప‌ర్ణ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుంది..?

Sundarakanda Aparna : ఒక‌ప్పుడు వెండితెర‌పై మెరిసిన కొంద‌రు అందాల ముద్దుగుమ్మ‌లు కొద్ది రోజుల‌కి తెర‌మ‌రుగ‌య్యారు. పెళ్లి చేసుకొని సినీ ప‌రిశ్ర‌మ‌కు పూర్తిగా దూరం అయ్యారు. అలాంటి వారిలో సుంద‌ర‌కాండ అప‌ర్ణ ఒక‌రు. కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ రీమేక్ సినిమా అప్ప‌ట్లో సూప‌ర్ హిట్ కాగా, వెంకీ – మీనా జంట‌గా న‌టించిన ఈ సినిమాలో లెక్చ‌ర‌ర్ వెంక‌టేష్‌ను ప్రేమించే ఓ అల్ల‌రి పిల్లగా అపర్ణ న‌టించి మెప్పించింది.ఈ సినిమాతో అపర్ణ ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా త‌ర్వాత అపర్ణ పేరు పెద్ద‌గా వినిపించ‌లేదు. అయితే అస‌లు అపర్ణ ఎవ‌రు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? ఈ సినిమాలో ఆమెకు హీరోయిన్‌గా ఎలా ? ఛాన్స్ వ‌చ్చిందో తెలుసుకుంటేనే విచిత్రం అనిపిస్తుంది.

సుంద‌ర‌కాండ చిత్రం కోసం రాఘ‌వేంద్ర‌రావు స్టార్ హీరోయిన్‌ని తీసుకోవాల‌ని అనుకున్నారు. అయితే పాత్ర‌కి కొత్త అమ్మాయి అయితే బాగా సెట్ అవుతుంది అని భావించి అపర్ణ ను తీసుకున్నారు. ఒక రోజు రాఘవేంద్ర రావు గారు నిర్మాత కె.వి.వి. సత్యనారాయణ ఇంటికి వెళ్ళినప్పుడు రాఘవేంద్రరావ‌కు అక్కడ ఉన్న ఒక అమ్మాయి బాగా నచ్చింది. ఆ అమ్మాయి అయితే తన మూవీలోని పాత్రకు సరిగ్గా సూట్ అవుతుందని భావించి రాఘవేంద్ర రావు ఆ అమ్మాయిని ఫైన‌ల్ చేశారు. దీంతో అపర్ణ అవ‌కాశం అందుకోవ‌డం, ఆ సినిమాతో పాపులారిటీ ద‌క్కించుకోవ‌డం జ‌రిగింది.

sundarakanda aparna do you know how is she now

ఈ మూవీ తర్వాత అపర్ణ‌కి బాగానే గా అవకాశాలు క్యూ కట్టాయి కానీ ఆమె పేరెంట్స్ అంగీకరించలేదు. అయితే అపర్ణ దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన అక్క పెత్తనం చెల్లెలి కాపురం అనే చిత్రంలో యాక్ట్ చేయడం జరిగింది. ఈమె శాంతినికేత‌న్, చంద్ర జ్వాల సీరియ‌ల్స్‌లో కూడా న‌టించారు. ఆ తర్వాత అపర్ణ 2002 లో మ్యారేజ్ చేసుకొని అమెరికా వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోయింది.ఆమెకు ఓ బాబు ఉన్నారు. ప్ర‌స్తుతం అపర్ణని చూస్తే అస్స‌లు గుర్తు ప‌ట్ట‌లేరు.

Admin

Recent Posts