వినోదం

ఉదయ్ కిరణ్ – సుశాంత్ ఇద్దరి మరణాల్లో ఉన్న కామన్ పాయింట్ !

హీరో సుశాంత్ సింగ్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఒక్కసారిగా కుదిపేసింది. చిన్న వయసులో డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని మరణించారు. సేమ్ సుశాంత్ సింగ్ లాగే టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ కూడా చిన్న వయసులోనే మరణించారు. వీరిద్దరూ యంగ్ హీరోలు. వీరి మరణం కూడా ఒకే పోలికలతో ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరీ అవి ఏంటో ఓ సారి చూద్దాం.. వీరిద్దరి సినీ కెరీర్ లో మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఉదయ్ కిరణ్ చేసిన నువ్వు నేను, మనసంతా నువ్వే, చిత్రం సూపర్ హిట్, అదేవిధంగా సుశాంత్ నటించిన శుద్ద్ దేశి రొమాన్స్, కైపోచే అలాగే ఆయన ఒక పాత్రలో నటించిన పీకే చిత్రాలు హ్యాట్రిక్ విజయం సాధించాయి..

అలాగే వీరిద్దరి నాలుగో సినిమాలుఅయినా కలుసుకోవాలని, డిటెక్టివ్,బ్యోమాకేస్ భక్తి యావరేజ్ గా నిలిచాయి. వీరిద్దరూ టీనేజ్లోనే సినీ కెరియర్ మొదలుపెట్టారు. ఇద్దరూ చదువుకునే రోజుల్లోనే సినీ ఇండస్ట్రీకి వచ్చారు. అలాగే ఇద్దరికి కూడా వారివారి తల్లులతో ఎక్కువ అనుబంధం ఉంది. సుశాంత్ డిగ్రీ చేసే సమయంలో తల్లి మరణించింది. ఉదయ్ కిరణ్ సినీ జీవితం మొదలుపెట్టిన తరుణంలో తన తల్లి మరణించింది. ఇద్దరూ తల్లుల మరణం తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లారు.

there are lot of common points in uday kiran and sushant singh deaths

ఈ ఇద్దరు హీరోలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆడిషన్స్ ద్వారానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇందులో ఉదయ్ కిరణ్ చేసిన సినిమాల సంఖ్య 20 లోపు. సుశాంత్ చేసిన సినిమాల సంఖ్య 12.. ఇక ఉదయ్ కిరణ్ 19 సినిమాలు రిలీజ్ అయితే, సుశాంత్ వి 11 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే ఉదయ్ కిరణ్ సినీ ఇండస్ట్రీలో రాణించిన సమయం 13 సంవత్సరాలు. అలాగే సుశాంత్ కెరియర్ కాలం కూడా అటు ఇటుగా 13 సంవత్సరాలు.. ఈ ఇద్దరు యంగ్ హీరోలు చనిపోయింది డిప్రెషన్ కారణంగానే..

ఉదయ్ కిరణ్ తన సినీ కెరీర్ పరంగా డిప్రెషన్ లోకి వెళ్తే, సుశాంత్ వ్యక్తిగత విషయాల పరంగా ఉరి వేసుకుని చనిపోయారు.. ఇద్దరు చనిపోయిన రోజు ఆదివారం కావడం మరో ఆశ్చర్యకర విషయం. ఉదయ్ కిరణ్ చనిపోయింది 5 జనవరి 2014, సుశాంత్ చనిపోయింది 14 జూన్ 2020.. చనిపోయే సమయానికి ఇద్దరు వయసు 34 లోపే. ఈ విధంగా వీరి మరణమనేది చాలా దగ్గరి పోలికలతో ఉండడంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది.

Admin

Recent Posts