సినిమా స్టార్లు ఈ మధ్య సక్సెస్ తోనే కాదు కాంట్రవర్సీ లతో కూడా హాట్ టాపిక్ అవుతున్నారు. ఎంత పెద్ద స్టార్ అయినా ఎక్కడో ఏదో ఒక ఇష్యూలో ఇరుక్కుని న్యూస్ లో నిలుస్తున్నారు. ఈమధ్య సినిమా వాళ్ల మీద కాంట్రవర్సీ లతోపాటు ట్రోలింగ్ కూడా బాగా ఎక్కువైంది. సెలబ్రిటీలు ఈమధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్ తో కాకుండా ట్రోలింగ్ వల్లనో, కాంట్రవర్సీల వల్లనో హైలెట్ అవుతున్నారు. అయితే మన టాలీవుడ్ లో వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న తారలు ఎవరో చూద్దాం. సమంత ఎన్నో కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది.కానీ పుష్ప మూవీలో సమంత చేసిన ఊ అంటావా, ఊ ఊ అంటావా స్పెషల్ సాంగ్ ఆడియన్స్ కి ఎంత నచ్చి హిట్ అయినా, అదే రేంజ్ లో కాంట్రవర్సీలో ఇరుక్కుపోయింది.
విజయ్ దేవరకొండ కాంట్రవర్సీలతో హైలెట్ అవుతుంటారు. పుష్ప సినిమాని ఆయన పెద్దగా పట్టించుకోకుండా ఆర్ఆర్ఆర్ కి మాత్రం సపోర్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆయనను ట్రోల్ చేశారు. అలాగే గతంలో లైగర మూవీ డిజాస్టర్ అయినప్పటికీ ఈ మూవీ విడుదల ఆలస్యం అయినందుకు కూడా విజయ్‌ని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ వివాదాలకు తెర తీస్తారు. ఆయన ఎల్లప్పుడూ కాంట్రవర్సిలతోనే జీవిస్తారు. గతంలో టీడీపీ, జనసేనలపై చేసిన విమర్శలు, తీసిన మూవీలకు గాను ఈయన ప్రస్తుతం కేసుల్లో చిక్కుకున్నారు. అలాగే మోహన్ బాబు ఇటీవలే ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేసి వార్తల్లో నిలిచారు. గతంలోనూ ఆయన మీడియా పట్ల ఇలాగే ప్రవర్తించి వివాదాల్లో చిక్కుకున్నారు.
బాలయ్య తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు. ఈ మధ్య కాలంలో ఈయన సైలెంట్‌గానే ఉన్నారు. కానీ తన ఫ్యాన్స్‌ను మాత్రం కొడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. పోసాని ఎక్కువగా రాజకీయాలపై మాట్లాడుతూ వివాదాలకు తెర తీస్తారు. గతంలో ఈయన టీడీపీ, జనసేనలపై చేసిన విమర్శలకు ప్రస్తుతం కేసుల్లో ఇరుక్కుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు కూడా తెలిపారు. ఇక ప్రకాష్ రాజ్ ఎల్లప్పుడూ బీజేపీపై కామెంట్లు చేసి నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే బాలీవుడ్ నటి కంగనా వివాదాలకు మారుపేరుగా మారింది. ఇప్పుడు ఏదో ఒక విషయంపై హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. బండ్ల గణేష్ కూడా తరచూ ట్విట్టర్లో పోస్టులు పెడుతూ వివాదాలకు తెర లేపుతారు. మంచు విష్ణు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆనయకే తెలీదు. దాంతో ట్రోలింగుకు గురవుతారు. విశ్వక్ అలాగే అతడు చేసిన ప్రతి సినిమా కూడా వివాదాలను ఎదుర్కొంటుంది.