ఆధ్యాత్మికం

ఈ ఆల‌యంలో ఉన్న కోనేటిలో స్నానం ఆచరిస్తే చాలు.. అన్ని దోషాలు పోయి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది..

ఆంధ్ర ప్రదేశ్ ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటి పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ దివ్య క్షేత్రం..ఎటు చూసినా జలపాతాలు, దట్టమైన అడవి ప్రకృతి దృశ్యాలతో, ఎత్తైన కొండకోనల్లో, ప్రశాంత వాతావరణంలో కొలువైన క్షేత్రం పెంచలకోన. ఈ ప్రాంత పరిసరాలన్నీ అందమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నుండి 75 కిలోమీటర్ల దూరంలో … నల్లమల అడవులు, శేషాచలం అడవులు కలిసిపోయె ప్రాంతంలో … సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తున ఉన్న పెంచలకోన క్షేత్రం నిత్యం భక్తులతో శోభాయమానంగా వెలుగొందుతోంది.ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు..

శ్రీహరి నరసింహుడిగా మారి హిరణ్యకస్యపుడిని సంహరించి ఉగ్ర నరసింహుడు అయ్యాడు. ఆ మహోగ్ర రూపంలో వెళ్తుంటే దేవతలు, ప్రజలు భయబ్రాంతులు గురయ్యారు. అలా శేషాచలం అడవుల్లో సంచరిస్తుంటే చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి కనిపించింది. అప్పుడు ఆ ముగ్ధమొహన సౌందర్యం ఆయనని శాంతపరిచింది. స్వామి పెళ్ళిచేసుకోవాలని చెంచురాజుకి కప్పం చెల్లించి ఆమెను పరిణయమాడాడు. ఆమెను పెనవేసుకొని ఈ అటవీ ప్రాంతంలో శిలగా స్థిరపడ్డాడు. ఆ శిల వెలసిన ప్రాంతం పెనుశిల కోన అయ్యింది..రాను రాను పెంచల‌ కోనగా మారింది.

penchalakona lakshmi narasimha swamy temple interesting facts

పర్వత ప్రాంతంలో వెలసిన స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తుంటారు. మామూలు రోజుల్లో అయితే చీమ చిటుక్కుమన్నా వినిపిస్తుందేమో అన్న ప్రశాంతంగా ఉంటుంది అదే వేసవి కాలం అయితే భక్తులతో కిక్కిరిసిపోతుంది..ఎక్కడేక్కడి నుంచో భక్తులు స్వామి భారీ దర్షనానికి తరలి వస్తారు.పెంచలకోన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ నరసింహ స్వామి ఆలయం కలదు. ఇక్కడ వెలసిన నరసింహ స్వామిని పెంచల స్వామి గా ఆరాధిస్తుంటారు భక్తులు..ఈ క్షేత్రంలోని గర్భగుడి సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారని భక్తుల వాదన వినిపిస్తుంది..ఆదిలక్ష్మీ, అమ్మవారి ఆలయానికి దగ్గరలో సంతానలక్ష్మి వటవృక్షం ఉంది. పిల్లలు లేని వారు ఈ చెట్టుకు చీరకొంగుతో ఊయల కడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం…శ్రీహరి చెంచులక్ష్మి ని వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మి దేవి అమ్మవారు ఆగ్రహించి స్వామికి ఆల్లంత దూరంలో ఏటి అవతల గట్టు కు వెళ్లిపోయినట్లు అక్కడ అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించారు.

ఇకపోతే ఇక్కడ సప్తతీర్థాలు కొలువుదీరి ఉన్నాయి. కొండమీద నుంచి దిగువన ఉన్న కోనకు చేరుకునే వరకు ఏడు నీటి గుండాలు ప్రవహిస్తుంటాయి. ఈ గుండాల్లో స్నానమాచరిస్తే అన్ని దోషాలు పోయి పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం..ఇక్కడ ఈ సమయంలో వెళ్తే వర్షాలకు జలకలతో కన్నుల విందుగా ఉంటుంది. పెంచలకోన చేరుకోవటానికి రోడ్డు వ్యవస్థ ప్రధాన రవాణా మార్గం గా ఉన్నది. వాయు, రైలు మార్గాల సౌకర్యం కూడా ఈ క్షేత్రానికి ఉన్నాయి. పెంచలకోన కు సుమారు 100 కి. మీ. దూరంలో ఉన్న తిరుపతి రేణిగుంట విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఇక్కడి నుండి క్యాబ్ లేదా ట్యాక్సీ లను అద్దెకు తీసుకొని రోడ్డు మార్గం ద్వారా పెంచలకోన సులభంగా చేరుకోవచ్చు. ప్రయాణ సమయం 2 గంటలు.. పెంచలకోన కు సమీపాన ఉన్న రైల్వే స్టేషన్ రాజంపేట రైల్వే స్టేషన్. ఇది 31 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సమీపాన ఉన్న మరొక ప్రధాన రైల్వే స్టేషన్ గూడూరు రైల్వే జంక్షన్. ఇది 70 కి.మీ. దూరంలో ఉన్నది. రైల్వే స్టేషన్ లో దిగి ప్రవేట్ ట్యాక్సీ లు లేదా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించి పెంచలకోన వెళ్ళవచ్చు..

పెంచలకోన కు ప్రధాన రవాణా మార్గం రోడ్డు వ్యవస్థే. కడప (138 కి.మీ) , నెల్లూరు (80 కి.మీ), వెంకటగిరి (60 కి.మీ), గూడూరు, రాజంపేట ( 34 కి.మీ) ప్రాంతాల నుండి పెంచలకోన కు ఆర్టీసీ బస్సులు తిరుగుతుంటాయి. నెల్లూరు నుండి ప్రతి గంటకు ఒక బస్సు పెంచలకోన బయలుదేరుతుంది.. ప్రత్యెకమైన రోజుల్లో బస్సులు తిరుగుతూ ఉంటాయి..

Admin

Recent Posts