భారత దేశంలోని హిందువులు ఎక్కువగా .ప్రత్యెకమైన పూజలు చేస్తారు.తమ ఇష్ట దైవాన్ని పూజించడం ద్వారా తమ అనుకున్న కోరికలు నెరవేరుతాయని భావిస్తారు.కానీ తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేయడంవల్ల అది మనకు మేలు చేయడం జరుగుతుంది అనే మాట పక్కన పెడితే, లేనిపోని అనర్థాలు తెచ్చిపెడుతుంది.పూజ గది లో చేయకూడని ఆ నాలుగు పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇప్పటి కాలంలో సొంతంగా నిర్మించిన గృహంలో పూజగది అనేది ఒక చిన్న అలమరలా కడుతున్నారు. ఈ చిన్న అలమర లోనే దేవుడు పటాలు మొత్తం అమర్చుతారు. దీపం వెలిగించేటప్పుడు ఖాళీ లేక నేలమీద పెడతారు. ఇలా చేయడం అనేది అశుభంతో సమానం. ఎందుకంటే చనిపోయిన వారికి మాత్రమే దీపం అనేది నేల మీద పెడతారు. అందుకే దీపం అనేది దేవుని ఎదుట ఏదన్నా ఒక ప్లేట్లో గాని లేక తమలపాకుపైన గాని అమర్చి దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి.
పూజగదిని శుభ్రం చేసేటప్పుడు దేవుడు పటాలు, విగ్రహలు ఏదైనా పీట మీద గానీ లేదా శుభ్రమైన వస్త్రం మీద గాని ఉంచాలి. మనకు తెలియక నేలమీద పెట్టేస్తూ ఉంటాం. ఇలా చేయడంవల్ల దేవతలను అవమానించినట్లు, దీని వలన ఇంటిలోని శాంతి కరువవుతుంది అని వేద బ్రాహ్మణులు వెల్లడిస్తున్నారు.. బంగారు ఆభరణాలు విలువైన వజ్ర వైఢూర్యాలు లక్ష్మీదేవి తో సమానం. అదే విధంగా దేవతలకు అలంకరించే ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లో నేలమీద ఉంచకూడదు. నేల మీద ఆభరణాలు ఉంచడం వల్ల మనం తిరిగే కాలు ధూళి వాటికి అంటుకునే ప్రమాదం ఉంటుంది. అలా ధూళి అంటుకున్న ఆభరణాలను దేవత విగ్రహాలకు అలంకరించడం ద్వారా మనం దేవతలను అవమానించినట్లే అవుతుంది.
శంఖం అనేది లక్ష్మీదేవికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. శంఖం ఇంటిలోని దేవుని ఎదుట ఊదడం వల్ల ఇంటికి సకల శుభాలూ కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శంఖాన్ని నేలపై ఉంచకూడదు.అలా చేసినట్లయితే ఆర్థిక భాధలు పెరుగుతాయి.. అందుకే ఈ నాలుగు వస్తువులను నేల మీద పెట్టకూడదు..ఇది తప్పక గుర్తుంచుకోవాలి.