వినోదం

సమంత దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన 10 వస్తువులు ఇవే..!

అక్కినేని నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న అనంత‌రం స‌మంత అందాల డోసు మ‌రింత‌గా పెంచిన విష‌యం తెలిసిందే. గ‌తంలో ఎన్న‌డూ లేన‌ట్లుగా సామ్ అందాల ప్ర‌ద‌ర్శ‌న ఉండ‌డంతో సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఈ అమ్మ‌డి ప్ర‌వ‌ర్త‌న‌కు విస్మయం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం చేతిలో సినిమాలు ఏమీ లేకున్నా అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో మాత్రం త‌గ్గేదేలే అంటోంది. అయితే దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే సామెత‌ను స‌రిగ్గానే వంట బ‌ట్టించుకున్న స‌మంత తాను హీరోయిన్‌గా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న స‌మ‌యంలోనే అనేక ఆస్తుల‌ను పోగు చేసింది. ఈ క్ర‌మంలోనే ఆమె వ‌ద్ద ప్ర‌స్తుతం ఉన్న 10 అత్యంత ఖ‌రీదైన వ‌స్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

హైద‌రాబాద్‌లో స‌మంత‌కు ఉన్న ఇంటి ఖ‌రీదు సుమారుగా రూ.30 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం. ఆమె దగ్గ‌ర రూ.2.30 కోట్లు విలువ చేసే ల్యాండ్ రోవ‌ర్ కారు కూడా ఉంది. రూ.1.46 కోట్లు విలువ చేసే పోర్షె కేమాన్ జీటీఎస్ అనే మ‌రో కారు కూడా ఆమె వ‌ద్ద ఉంది. ఆడి క్యూ 7 (రూ.90 ల‌క్ష‌లు), జాగ్వార్ ఎఫ్ఎక్స్ (రూ.72 ల‌క్ష‌లు) అనే కార్లు కూడా ఆమె వ‌ద్ద ఉన్నాయి. అలాగే స‌మంత ద‌గ్గ‌ర ఖ‌రీదైన బ్యాగులు కూడా ఉన్నాయి. క్రిస్టియ‌న్ డియ‌ర్ బ్యాగ్ (రూ.2.50 ల‌క్ష‌లు), లూయీస్ విట్ట‌న్ బ్యాగ్ (రూ.2.17 ల‌క్ష‌లు), జీజీ మార్మోంట్ స్లింగ్ బ్యాగ్ (రూ.1.50 ల‌క్ష‌లు) లు ఆమె వ‌ద్ద ఉన్నాయి.

samantha has these 10 costliest items

స‌మంత ధ‌రించే మ‌నోలో బ్లాహ్నిక్ బ్లాక్ హీల్స్ విలువ రూ. 1 లక్ష వరకు ఉంటుంద‌ని స‌మాచారం. అలాగే స‌మంత త‌న దుస్తుల బ్రాండ్ సాకీ అనే కంపెఈలో రూ.30 కోట్ల మేర వాటాను క‌లిగి ఉంది.

Admin

Recent Posts