వినోదం

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన సెలెబ్రిటీ జంటలు ఇవే..!!

ప్రేమించుకుంటారు. వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు. నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకునేలోపే కొన్ని జంటలు విడిపోతాయి. ఈ ఘటనలను చూసినప్పుడు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోని కాదు. సెలబ్రిటీల లైఫ్ లోను జరుగుతుంటాయి. పెళ్లి పీటలు వరకు వచ్చి విడిపోయిన నటీ నటులపై ఫోకస్… రష్మిక – రక్షిత్ శెట్టి: తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న రష్మిక మందన ఎంగేజ్మెంట్ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి తో అయ్యింది కానీ… అనూహ్యంగా వీళ్లు విడిపోవడం… వీళ్ళ పెళ్లి క్యాన్సిల్ అవ్వడం జరిగింది.

మెహరీన్ – భవ్య బిష్ణోయ్: టాలీవుడ్ హీరోయిన్ మెహరిన్ ఎంగేజ్మెంట్ భవ్య బిష్ణోయ్ తో జరిగింది. కానీ వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయింది. అఖిల్ – శ్రియా భూపాల్: నాగార్జున కొడుకు మరియు టాలీవుడ్ హీరో అఖిల్, శ్రీయ భూపాల్ ల ఎంగేజ్మెంట్ 2016లో పెద్దల సమక్షంలో జరిగింది. కానీ వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయింది. ఉదయ్ – కిరణ్ సుష్మిత: ప్రేమ కథా చిత్రాలతో దూసుకొచ్చిన యువ హీరో ఉదయ్ కిరణ్, మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మితకు పెళ్లి కుదిర్చారు. వీరిద్దరికీ 2003లో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ అయిన కొన్ని రోజులకే వీరిద్దరు విడిపోయారు. సుష్మిత , విష్ణు ప్రసాద్ ని పెళ్లి చేసుకోగా, ఉదయ్ కిరణ్, విషిత ని తన భాగస్వామిగా చేసుకున్నారు.

these actors marriages stopped after their engagement

తరుణ్ , ఆర్తి అగర్వాల్: నువ్వు లేక నేను లేను సినిమాలో తరుణ్, ఆర్తి అగర్వాల్ హీరో , హీరోయిన్లుగా నటించారు. అప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమపక్షుల లాగా కలిసి తిరిగారు. జీవితాంతం కలిసి జీవించాలనే వీరి ఆశ కలగానే మిగిలింది.

Admin

Recent Posts