నిత్యం తగిన మోతాదులో నీటిని తాగడం మనకు ఎంతో అవసరం. నీటిని రోజూ తగినంతగా తాగితే మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రోజుకు కనీసం 8 గ్లాసుల నీటినైనా తాగాలి. దీంతో శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉండి జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. అయితే నీటిని ఎంత తాగినా, ఎప్పుడు తాగినా నిలబడి మాత్రం తాగకూడదట. కచ్చితంగా కూర్చునే నీటిని తాగాలట. ఎందుకో తెలుసుకుందాం రండి. నిలబడి ఉన్నప్పుడు నీటిని తాగితే నీరు ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి పడుతుంది. ఈ క్రమంలో జీర్ణాశయం గోడలపై కూడా నీరు ఒకేసారి చిమ్మినట్టు అవుతుంది. దీంతో అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బ తింటాయి. దీని వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు కలుగుతాయి.
నిలబడి ఉన్నప్పుడు నీటిని తాగితే నీరు సరిగా కిడ్నీలకు అందక అది సరిగ్గా శుద్ధి కాదు. దీంతో కిడ్నీలు, మూత్రాశయ సంబంధ సమస్యలు వస్తాయి. శరీరంలో ఉన్న ద్రవాల సమతుల్యత దెబ్బ తింటుంది. దీంతో ఎక్కువగా ద్రవాలు కీళ్లలో చేరిపోయి ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. కూర్చుని ఉన్నప్పుడు శరీరం రిలాక్స్‌గా ఉంటుంది. ఈ స్థితిలో నీటిని తాగితే అది జీర్ణాశయంలోకి సక్రమంగా వెళ్లి మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. అంతేకాదు జీర్ణాశయంలోకి అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లాల ప్రభావం తగ్గుతుంది.
నిలబడి ఉన్నప్పుడు కాక కూర్చుని ఉన్నప్పుడు నీటిని తాగాలని, అలా తాగినప్పుడు కూడా ఒకే సారి పెద్ద మొత్తంలో నీటిని తాగకుండా కొంచెం కొంచెం నీటిని ఎక్కువ సార్లు తాగాలని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల కడుపులోకి చేరే గ్యాస్ వెంటనే బయటికి వెళ్లిపోతుంది. నిలబడి ఉన్నప్పుడు నీటిని తాగితే దాహం కూడా సరిగ్గా తీరదట. కాబట్టి నీటిని కూర్చునే తాగడం బెటర్.