ఖలేజా సినిమా రిలీజ్ కి ముందు ఒక ఫంక్షన్లో మహేశ్ మాట్లాడుతూ..ఇప్పటివరకూ ఏ సినిమాలో రాని విధంగా ఈ సినిమా చేశాం..దీని తర్వాత చేసే సినిమా ఇంతకంటే ఎక్కువగా చూపించలేం అని చెప్పాడు.కానీ రిలీజ్ అయ్యాక సినిమా అట్టర్ ప్లాప్ టాక్ వచ్చింది.కానీ సినిమా చూసిన వారి నుండి స్పందన మాత్రం బాగుందనే వచ్చింది.వారి మాట ప్రకారం అని కాదు కానీ..ఖలేజా సినిమాలో మహేశ్ నటన,అనుష్క అందాలు, పాటలు,సీన్స్,త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అన్ని కూడా బాగుంటాయి.ఇప్పటికీ టీవిలో వస్తే చూసే ప్రేక్షకులు ఎక్కువే…కానీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు… సినిమా బాగున్నప్పటికీ హిట్ అవ్వని సినిమాలు కొన్నున్నాయి..వాటికి కారణాలు ఏంటో కానీ..ఆ సినిమాలు ఏవో తెలుసుకోండి..
అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఆర్య..ఆర్య సినిమాతో అల్లు అర్జున్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.అలాంటి ఆర్యా మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఆర్యా2 మాత్రం ప్లాప్ అయింది.కథ,కథనం..అర్జున్,నవదీప్,కాజల్ నటన,అదరగొట్టిన పాటలు అన్ని ప్లస్సే ఈ సినిమాకి అయినా కూడా ప్లాప్ అయింది… ఎన్టిఆర్ కెరీర్లో ప్లాప్ సినిమాలు ఉండొచ్చు కానీ ఊసరవెల్లి ఎందుకు ప్లాప్ అయిందో మాత్రం ఎవరికి అర్దం కాదు.ఎందుకంటే ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో చాలా బాగుంటుంది.దాంతోపాటు మంచి కథ,ఎప్పటిలానే ఆకట్టుకునే ఎన్టీఆర్ స్టెప్స్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా విజయాన్ని అందుకోలేదు.
నానీ సినిమా అంటే ఒక్కసారైనా చూడొచ్చు అనేంత ఫీల్ ఉంటుంది.కెరీర్లో మొదటి నుండి కూడా ఆచితూచి అడుగులేస్తూ మంచి కథలెంచుకుంటూ,తనదైన నటన ప్రదర్శిస్తున్నాడు నానీ.కానీ నానీ కెరీర్లో కూడా సినిమా బాగున్నా కూడా హిట్టవని సినిమా ఒకటి ఉంది.అదే ఎవడే సుబ్రహ్మణ్యం. నారా రోహిత్ సినిమాలు హిట్,ప్లాప్ లతో సంభందం లేకుండా అందరినీ ఆకట్టుకుంటాయి.కానీ ఖచ్చితంగా హిట్ సినిమా అనుకున్నది మాత్రం ప్లాప్ ఖాతాలో పడిపోయిందే అదే రౌడిఫెల్లో..విలన్ హీరో నువ్వా నేనా అంటూ సాగే రౌడిఫెల్లో ఎందుకు ప్లాపఅయిందో తెలియదు.
ప్రభాస్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్ మున్నా..ప్రతి సీన్,ప్రభాస్,ఇలియానా,ప్రకాశ్ రాజ్ ఎవరికి వారు వారి పరిధిలో బాగా నటించారు.పాటలు కూడా ఇప్పటికీ హమ్ చేస్తూనే ఉంటారు.కానీ సినిమా హిట్ అవ్వలేదు. హిట్స్ తో సంభందంలేకుండా అభిమానులను సంపాదించుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.తన సినిమాలు బాగున్నా బాగలేకపోయినా అభిమానుల అభిమానంలో మాత్రం తేడా ఉండదు..పవన్ సినిమాల్లో బాగుండి కూడా హిట్టవని సినిమా ఏదన్నా ఉందా అంటే గుడుంబా శంకర్. రాంచరణ్ కెరీర్లో ఇలాంటి సినిమా ఏదన్నా ఉందా అంటే ఆరెంజ్..ప్రేమకి సరికొత్త నిర్వచనం ఇచ్చిన ఆరెంజ్ సినిమా ఎందుకు హిట్టవ్వలేదో ఎవరికి అర్దం కాదు..పాటలు మాత్రం సూపర్ డూపర్ హిట్… గగనం సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చింది.అప్పుడు నాగార్జున కూడా మంచి ఫామ్ లో ఉన్నారు.కానీ గగనం సినిమా మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేదు. సుకుమార్ సినిమా అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది.అంతటి ఎక్స్పెక్టేషన్ ని రీచ్ అయినప్పటికీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు..అదే జగడం.రామ్ కెరీర్లో సినిమా బాగుండి హిట్టవని సినిమా జగడం..యూత్ కి కనెక్ట్ అయ్యేలా తీసిన జగడం ప్లాప్ కి కారణాలు మాత్రం తెలియవు.