కొబ్బరి నూనెను చాలా మంది జుట్టుకు రాసుకునేందుకు వాడుతారు. అయితే అలా కాకుండా వంటలకు ఉపయోగించే కొబ్బరి నూనె కూడా మనకు దొరుకుతుంది. ఈ క్రమంలో అలాంటి కొబ్బరి నూనెను తరచూ వాడుతుంటే దాంతో మనకు బోలెడు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలో ఉండే పోషకాలు మన శరీరానికి అందుతాయి. కొబ్బరినూనె వల్ల ఎలాంటి అనారోగ్యాలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కాలిన గాయాలకు కొబ్బరినూనె అద్భుతంగా పనిచేస్తుంది. సంబంధిత ప్రదేశంపై ఎప్పటికప్పుడు కొబ్బరినూనెను రాస్తుంటే దాంతో కాలిన గాయం త్వరగా మానుతుంది.
వెరికోస్ వీన్స్ (ఉబ్బి గడ్డ కట్టిన రక్త నాళాలు) సమస్య ఉన్నవారు సంబంధిత ప్రదేశంలో రోజుకు 3 నుంచి 6 సార్లు కొబ్బరి నూనె రాసి మసాజ్ చేయాలి. దీంతో ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, అర టేబుల్ స్పూన్ చియా సీడ్స్ కలిపి రోజూ ఉదయాన్నే పరగడుపున తినాలి. దీంతో రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. శక్తి ఎక్కువగా అందుతుంది. రాత్రి పూట నిద్రించే ముందు కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని ముఖానికి రాసుకోవాలి. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై వచ్చే ముడతలు పోతాయి. రోజుకు 3 సార్లు అర టీ స్పూన్ నుంచి ఒక టీస్పూన్ మోతాదులో కొబ్బరినూనెను తాగుతుంటే దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి.
మేకప్ రిమూవ్ చేసేందుకు కూడా కొబ్బరి నూనె పనికొస్తుంది. సింపుల్‌గా ఆ నూనెను ముఖానికి రాసుకుని కొంత సేపు ఆగాక కడిగితే చాలు, మేకప్ ఇట్టే తొలగిపోతుంది. కొబ్బరి నూనె, బేకింగ్ సోడా, పెప్పర్‌మింట్ ఆయిల్‌లను సమ భాగాల్లో కలిపితే మిశ్రమం తయారవుతుంది. దీన్ని టూత్ పేస్ట్‌లా వాడుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, అంతే మోతాదులో బీస్ వ్యాక్స్, ఒక టేబుల్ స్పూన్ షియా బటర్ లను తీసుకుని నాన్‌స్టిక్ ప్యాన్‌పై వేసి వేడి చేయాలి. ఆ మిశ్రమాలన్నీ కరిగి ద్రవ రూపంలోకి వచ్చే వరకు వేడి చేసి అనంతరం చల్లారే వరకు అలాగే ఉంచాలి. దీంతో లిప్ బామ్ తయారవుతుంది. దాన్ని పెదవులకు రాసుకుంటే పెదవులు పగలకుండా మృదువుగా ఉంటాయి. పెదవులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కొబ్బరినూనె, ఎసెన్షియల్ ఆయిల్స్, బేకింగ్ సోడాలను కలిపితే మిశ్రమం వస్తుంది. దాన్ని డియోడరంట్‌గా ఉపయోగించుకోవచ్చు.
కొద్దిగా కొబ్బరినూనె, లవంగం నూనె, టీ ట్రీ ఆయిల్, తేనెలను కలిపి అనంతరం వచ్చే మిశ్రమాన్ని ఫేస్ వాష్‌గా ఉపయోగించుకోవచ్చు. షేవింగ్ చేసుకున్న తరువాత చర్మం ఇరిటేట్ అవుతుంటే కొద్దిగా కొబ్బరినూనె రాయాలి. దీంతో ఆ సమస్య తగ్గుతుంది. కొబ్బరినూనె ఎండ నుంచి మనకు సంరక్షణనిస్తుంది. బయటికి వెళ్లే ముందు కొద్దిగా కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే తద్వారా అతినీలలోహిత కిరణాల నుంచి ముఖానికి సంరక్షణ లభిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, కొన్ని చుక్కల పెప్పర్‌మింట్ ఆయిల్, రోజ్ మేరీ, టీ ట్రీ ఆయిల్ లను కలిపితే మిశ్రమం వస్తుంది. దీన్ని దోమలను పారదోలేందుకు రీపెల్లెంట్‌గా ఉపయోగించుకోవచ్చు. యాంటీ ఫంగల్ గుణాలు కొబ్బరినూనెలో పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల కొద్దిగా కొబ్బరినూనెను సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తే ఫంగస్ ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ లభిస్తుంది.