సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు హీరోయిన్లు రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది చాలా కామన్ గా తీసుకుంటారు. ఇందులో ముఖ్యంగా ఎన్టీఆర్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.. ఆ తరం హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ కూడా రెండు వివాహాలు చేసుకున్నారు.. మరి కృష్ణ జీవితం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. సూపర్ స్టార్ కృష్ణ ముందుగా ఆయన మరదలైన ఇందిరా దేవిని 1961 లో వివాహం చేసుకున్నారు.. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహమే.. అలా కొన్నేళ్ల తర్వాత సాక్షి మూవీ ద్వారా విజయనిర్మల తో పరిచయం ఏర్పడింది..
ఇది కాస్త ప్రేమగా మారి దాంతో 1969లో కేవలం నలుగురు సమక్షంలోనే వీరిద్దరూ తిరుపతిలో రెండో వివాహం చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు భార్యలు ఉన్న కాని ఎవరిని ఏనాడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే విధంగా అస్సలు చూడలేదట.. వారిద్దరు కూడా కృష్ణను చాలా సిన్సియర్ గా ప్రేమించారట.. అందుకే వీరిద్దరూ ఉన్నా ఎలాంటి గొడవలు జరగలేదని, విజయనిర్మలని పెళ్లి చేసుకున్న కానీ ఇందిరకు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారని తెలుస్తోంది.
రెండో పెళ్లి జరిగిన తర్వాత కూడా ఇందిరా గారితో కృష్ణ తండ్రి అయ్యారు. అయితే ఈ తరుణంలో కుటుంబ సభ్యులు కొందరు కృష్ణ గారిని తప్పుబట్టే ప్రయత్నం చేసినా గాని, ఆయన తప్పు ఏమీ లేదని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కనుక ఆయనను ఎవరు ఏమి అనవద్దు అంటూ కృష్ణ గారికి ఇందిరా మద్దతుగా పలికిన సందర్భాలు అనేకం ఉన్నాయని సమాచారం.. అలాగే విజయనిర్మల కూడా కృష్ణ గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆయన మొదటి ఫ్యామిలీ తో ఎలాంటి గొడవలు లేకుండా సమస్యలు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారని, వీరిద్దరు కలిసి కృష్ణ తో చాలా అన్యోన్యంగా ఉండేవారని కొన్ని నిజాలు బయటకు వచ్చాయి.