Udayabhanu : ఒకప్పుడు సుమకి సమాన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ ఉదయభాను. గలగలా మాట్లాడుతూ.. స్పాంటేనియస్‌గా కౌంటర్లిస్తూ.. టీవీ రంగంలో తిరుగులేని రారాణిగా వెలిగింది ఉదయ భాను. ఎలాంటి షోలైన, ప్రీ రిలీజ్ ఈవెంట్లైనా, యాక్టర్స్ ఇంటర్వ్యూలైనా.. ఎవ్వరినీ హర్ట్ చేయకుండా సరదా ప్రశ్నలు వేస్తూ అందరిని ఎంటర్ టైన్ చేస్తుంది. సుమారు మూడు దశాబ్దాల నుండి యాంకర్‌గా కొనసాగుతున్న సుమకు పోటీ గా ఒక్క ఉదయ భాను నిలిచింది..ఒకప్పుడు యాంకరింగ్‌కు సొగసులు అద్దిన నటి మాత్రం ఉదయ భానునే.
ఉదయభాను పెళ్లి చేసుకుని, పిల్లలతో సంసార జీవితంలో సెటిలైన సంగతి తెలిసిందే. యాంకర్లకు స్టార్ డమ్ వచ్చిందంటే అది ఉదయభానుతోనే ప్రారంభమైందని చెప్పాలి. ఒకప్పుడు తన మాటల ప్రవాహంతో ఆడియన్స్ ను విశేషంగా అలరించిన ఉదయభాను గత కొన్నేళ్లుగా పబ్లిక్ లోకి వచ్చింది లేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఉదయభాను గతంలో ఒంగోలులో నిర్వహించిన నారా లోకేశ్ సభలో ప్రత్యక్షమయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతుండగా, జయహో బీసీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
లోకేశ్ పాల్గొన్న ఈ కార్యక్రమానికి ఉదయభాను వ్యాఖ్యాతగా, సంధానకర్తగా వ్యవహరించారు. ఆ కార్యక్రమంలో ఉదయ భాను మాట్లాడుతూ.. ప్రశ్నించే గళాలు.. అణచివేయబడతాయని.. అందుకు తానే నిదర్శనమంటూ ఓ వేదికపై మాట్లాడింది. ఆమెకు యాంకరింగ్ చేసే అవకాశాలు తగ్గిపోవడానికి కారణాల వెనుక కుట్ర జరిగిందని ఆమె చెప్పకనే చెప్పింది. గతంలో ఓ పాట పాడగా.. అప్పటి నుండి తనకు అవకాశాలు తగ్గిపోయానని, మీకు నేను కనబడి ఎన్నో ఏళ్లు అయిపోయిందని, అయినప్పటికీ తనను మీరెవ్వరూ మర్చిపోలేదంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాటలను బట్టి చూస్తే నిజమేనన్న సందేహం చాలా మందికి కలుగుతుంది. ఆమెను నిజంగా తొక్కేశారన్న అనుమానం కూడా చాలామందిలో కలిగింది.