వినోదం

Vasundhara : బాలకృష్ణ భార్య వసుంధరకు ఇష్టమైన బాలయ్య సినిమా ఏంటో తెలుసా..?

Vasundhara : నట సింహం నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలయ్య నటించిన సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ బాలకృష్ణ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ లో పేరున్న హీరో బాలకృష్ణ ఒక్కరే. ఆయన తనయుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ వెనుతిరిగి చూసుకోలేదు. బాలనటుడి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎన్నో పాత్రల‌ను పోషించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. బాలయ్య సినిమాలకు దగ్గరగా ఉన్నా.. ఆయన భార్య వసుంధర మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

బాలయ్య భార్య గురించి అభిమానులకు ఎక్కువగా తెలియదు. అయితే బాలయ్య సినిమాలలో ఆమెకు ఇష్టమైన సినిమా చెన్నకేశవరెడ్డి కావడం గమనార్హం. చెన్నకేశవరెడ్డి డైరెక్టర్ వివి వినాయక్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య తండ్రి, కొడుకు పాత్రల్లో నటించారు. అయితే వసుంధరకు మాత్రం కొడుకు పాత్ర కంటే తండ్రి పాత్రే ఎంతో ఇష్టమట. చెన్నకేశవరెడ్డి షూట్ సమయంలో బాలయ్య ఎంతో ఉత్సాహంగా ఉండేవారని వసుంధర వినాయక్ తో అన్నారట.

Vasundhara likes this balakrishna film very much Vasundhara likes this balakrishna film very much

అయితే ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేకపోయింది. స్టార్ హీరో అయినప్పటికీ బాలయ్య నిజ జీవితంలో చాలా సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. బాలకృష్ణ ప్రస్తుతం బోయ‌పాటి డైరెక్షన్ లో అఖండ 2 చేస్తున్నారు. ఇటీవ‌లే అన్‌స్టాప‌బుల్ సీజ‌న్‌లోనూ పాల్గొన్నారు.

Admin

Recent Posts