వినోదం

Venkatesh Soundarya : వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి.. వాటిలో హిట్ అయినవి ఏవి..?

Venkatesh Soundarya : అందం, అభినయం, తెలుగుదనం కలిస్తే కనిపించే అందాల బొమ్మ. సహజ సౌందర్యంతో.. పరిపూర్ణ నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సౌందర్య. సిల్వర్‌ స్ర్కీన్‌పై ఈ అందాల బొమ్మ కనిపించగానే ప్రేక్షకుల హృదయం ఆనందంతో పొంగిపోతుంది. ఒకదశలో సౌత్‌లో నంబర్‌ వన్‌ హీరోయిన్ గా వెలుగొంది. ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతుండగానే అందివచ్చిన అవకాశంతో సినీరంగంలోకి ప్రవేశించింది. సౌంద‌ర్య ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నారు.

ఇక సౌంద‌ర్య చాలామంది స్టార్ హీరోల ప‌క్క‌న న‌టించినా కూడా వెంక‌టేష్ సౌంద‌ర్య కాంబినేష‌న్ కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉండేది. వెంక‌టేష్ సౌంద‌ర్య కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. అలాగే ప‌విత్ర‌బంధం సినిమా 6 భాష‌ల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా పెళ్లి చేసుకుందాం రా.. ఈ సినిమా కూడా ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చి సూప‌ర్ హిట్ ను అందుకుంది.

Venkatesh Soundarya combination how many movies came

సౌందర్య వెంక‌టేష్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన మ‌రో సినిమా జ‌యం మ‌న‌దేరా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను సొంతం చేసుకుంది. అలాగే వీరిద్ద‌రి పెయిర్ కు ఎక్కువ మంది అభిమానులు అయిన సినిమా రాజా. ఈ సినిమా తర్వాత వెంక‌టేష్ సౌంద‌ర్య పెయిర్ కి క్రేజ్ మ‌రింత పెరిగింది. సౌంద‌ర్య వెంక‌టేష్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన దేవి పుత్రుడు సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో సౌంద‌ర్య వెంక‌టేష్ కాంబినేషన్ కు కూడా బ్రేక్ ప‌డింది. అంతేకాకుండా వెంక‌టేష్ హీరోగా న‌టించిన సూప‌ర్ పోలీస్ సినిమాలో సౌంద‌ర్య సెకండ్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది.

Admin

Recent Posts