వినోదం

Uday Kiran : ఉదయ్ కిరణ్ చేసిన ఘోరమైన తప్పు అదేనా.. అందుకే ఉదయ్ కెరీర్ నాశనం అయ్యిందా..?

Uday Kiran : దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ వెండితెరకు హీరోగా పరిచయమైన సినిమా చిత్రం. తేజ దర్శకత్వంలో తెరకెక్కిచిన ఈ మూవీతో ఉదయ్‌ తొలి సక్సెస్‌ అందుకున్నాడు. ఆ తర్వాత వెంట వెంటనే నువ్వు-నేను, కలుసుకోవాలని వంటి లవ్‌స్టోరీల్లో నటించి హ్యాట్రిక్‌ కొట్టాడు. అంతేకాదు ఈ చిత్రాలతో లవర్‌ బాయ్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండానే స్టార్‌ హీరో హోదా సంపాదించుకున్నాడు. ఉదయ్ కిరణ్ నటన.. సొట్టబుగ్గల అందానికి అమ్మాయిల్లో తెగ ఫాలోయింగ్ ఉండేది. ఎంత త్వరగా ఉదయ్ కిరణ్ కెరీర్ తారా స్థాయికి చేరిందో అంతే వేగంతో కిందకు చేరింది.

దానికి ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం ఒక కారణం అయితే.. మరో కారణం పర్సనల్ లైఫ్ లో జరిగిన అనేక విషయాలు. వచ్చిన ఆఫర్లను కూడా దర్శకులు, నిర్మాతలు వెనక్కి తీసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఉద‌య్ కిరణ్ చేసిన ఓ త‌ప్పు వ‌ల్లే అలాంటి ప‌రిస్థితి వచ్చింద‌ని ఓ వార్త వైర‌ల్ అవుతోంది. సినిమాల ఎంపిక విష‌యంలో చేసిన త‌ప్పే ఉద‌య్ కిర‌ణ్ కొంప ముంచింద‌ట‌. వ‌రుస‌గా ప్రేమ‌క‌థ‌లు చేయ‌డం వ‌ల్ల ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ వ‌చ్చింది. అయితే ల‌వ‌ర్ బాయ్ గా ఇమేజ్ వ‌చ్చిన హీరోలు ఆ తర్వాత ఇండ‌స్ట్రీలో రాణించిన‌ట్టు చ‌రిత్ర‌లో లేదు.

uday kiran did that mistakes costed him movies

కాబ‌ట్టి ఉద‌య్ కిర‌ణ్ విష‌యంలోనూ అలానే జ‌రిగిందంటున్నారు. సాధార‌ణంగా అప్పట్లో మాస్ హీరోల‌కే ఎక్కువగా క్రేజ్ ఉండేది. ఓ ఇంట‌ర్వ్యూలో కొత్త హీరో త్రిగుణ్ ఆదిత్ కూడా అదే విష‌యాన్ని చెప్పాడు. ఉద‌య్ కిర‌ణ్, త‌రుణ్ చేసిన త‌ప్పుల‌ను తాను చేయ‌న‌ని అన్నాడు. ఈ యంగ్ హీరో మాట్లాడిన కామెంట్లు వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు కూడా ఉద‌య్ కిర‌ణ్ ల‌వ‌ర్ బాయ్ చిత్రాల‌కు బ్రేక్ ఇచ్చి మాస్ సినిమా చేసి ఉంటే బాగుండ‌ని అనుకుంటున్నారు. అంతేకాకుండా ఉద‌య్ కిర‌ణ్ సై సినిమాను రిజెక్ట్ చేసి ఉండ‌కుండా ఉంటే బాగుండేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Admin

Recent Posts