వినోదం

Chiranjeevi : చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ భారీ మల్టీస్టారర్ ఎందుకు ఆగిపోయింది.. తెర వెనుక ఏం జరిగింది..?

Chiranjeevi : మల్టీస్టారర్‌ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా ఆ సినిమాపైనే. అభిమానుల అంచనాలైతే ఆకాశాన్ని అంటుతాయి. అయితే అలాంటి సినిమాలు పట్టాలెక్కించడం, జనాల్ని మెప్పించడం, కలెక్షన్లు తెప్పించడం అంత సులువేం కాదు. అందుకే పెద్ద హీరోలతో మల్టీస్టారర్‌లు ఎక్కువగా కలగానే మిగిలిపోతుంటాయి. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణల టైమ్‌లో మల్టీస్టారర్‌లు చూడగలిగాం. అదే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున హయాంలో సరైన మల్టీస్టారర్‌ చూడలేకపోయాం. మళ్లీ ఇప్పటి తరం అలాంటి ప్రయత్నాలు చేస్తోంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, బాహబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటివి ఆ కోవకు చెందినవే.

ఆ తర్వాత ఆచార్యలో తండ్రీ కొడుకులైన చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించారు. అంతకు ముందు నాగార్జున, నాగ చైతన్య కలిసి చేసిన బంగార్రాజు మూవీ ప్రేక్షకులను అలరించింది. కానీ చరిత్రలో నిలిచిపోయే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ల ఓ భారీ మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. 2002లో ఇంద్ర సినిమా తర్వాత తెలుగులో ఓ భారీ మల్టీస్టారర్ మూవీకి ప్లాన్ చేశారు కే.రాఘవేంద్రరావు. అందులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించాలనకున్నారు. అది కూడా తన 100వ సినిమాగా చరిత్రలో నిలిచిపోయేలా ఈ సినిమాను డైరెక్ట్ చేద్దామనుకున్నాడు.

what happened to chiranjeevi venkatesh and nagarjuna multi starrer movie

అంతేకాదు అప్పట్లో ఈ మల్టీస్టారర్ మూవీకి చిన్నికృష్ణ ఓ కథను కూడా రెడీ చేసి దర్శకేంద్రుడి ఇచ్చారు. ఈ సినిమాకు త్రివేణి సంగమం అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఈ చిత్రాన్ని 3 హిందూ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో కథ, కథనాన్ని రెడీ చేసారు. అంతా ఓకే అనుకున్నాకా ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అనుకున్నారు. ఈ భారీ మల్టీస్టార మల్టీస్టారర్ మూవీని అప్పట్లో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడుతో పాటు, అల్లు అరవింద్, అశ్వనీదత్ నిర్మించడానికి రెడీ అయ్యారు. చివరకు ఏం జరిగిందో ఏమో సెట్స్ మీదకు వెళ్ళకుండానే ఈ చిత్రం ఆగిపోయింది. ఈ స్టార్ హీరోలా అభిమానులకు నిరాశే మిగిలింది.

Admin

Recent Posts