తెలుగు చిత్రపరిశ్రమలోనే విలన్ పాత్రకే వన్నె తెచ్చిన విలక్షణ నటుడు రావు గోపాల రావు. ఆయన సినిమాలో ఒక ప్రత్యేకత ఉండేది. రంగస్థల నటుడిగా గుర్తింపు పొంది ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన స్టార్ విలన్ గా కొనసాగారు. ముందుగా ఇండస్ట్రీలోకి వచ్చిన తరుణంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఆయన క్రాంతి కుమార్ నిర్మాతగా తెరకెక్కిన శారద అనే సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీ తర్వాత శ్రీ బాపు గారి డైరెక్షన్ లో తెరకెక్కిన ముత్యాలముగ్గు అనే మూవీ ద్వారా ఆయన నటనతో అందరిని మెప్పించారు.
ఈ సినిమా తరువాత రావు గోపాలరావు దశ మారిపోయింది. ప్రతి సినిమాలో ఆయన పాత్ర లేకుండా ఏ సినిమా వచ్చేది కాదు. అంత డిమాండ్ పెరిగిపోయింది. అలా పేరు తెచ్చుకున్న ఆయన చివరి రోజుల్లో మాత్రం చాలా దయనీయ పరిస్థితుల్లో కన్నుమూశారు. ఆ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు. రావు గోపాలరావు డిమాండ్ అప్పట్లో మామూలుగా ఉండేది కాదు. ఆయన ఎంత అడిగితే అంత డబ్బు ఇచ్చి నిర్మాతలు సినిమాల్లో పెట్టుకునేవారు. అలా ఆయన చాలా ఆస్తులు సంపాదించారు. కానీ వాటిని నిలుపుకోవడం లో మాత్రం విఫలమయ్యారని చెప్పవచ్చు.
ఆయన పక్కన ఉన్న వారే ఆయనను నమ్మించి మోసం చేశారు. ఆస్తులన్నీ కాజేశారు. చివరికి ఆయన వయసు మీద పడి ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలో కనీసం ఆసుపత్రిలో చూయించుకోడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. చివరికి తాను దాచుకున్న కొంత డబ్బును బయటకు తీసి చికిత్స చేయించుకున్నారు. కానీ ఫలితం లేదు. చివరికి మరణించాడు. అసలు విషయం ఏంటంటే ఆయన మరణించిన తర్వాత అతన్ని చూడడానికి ఒక్క స్టార్ హీరో, నిర్మాత కూడా రాలేదంటే ఆయన ఏ విధంగా చనిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు.