ఈ భూమ్మీదికి వచ్చిన ప్రతి జీవి తన జీవితకాలం ముగియగానే చనిపోక తప్పదు. కానీ ఆ జీవుడు చేసిన కర్మలను అనుసరించి చావు అనేది కొంచెం ముందు వెనక ఉంటుంది అంతే.మరి అంత భయంకరమైన చావు గురించి శివపురణంలో ఏం చెప్పారు? మరణం సంభవించే టప్పుడు ఏ ఏ సంకేతాలు కనిపిస్తాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు పార్వతి శివున్ని మరణానికి ముందు ఏవైనా సంకేతాలు కనిపిస్తాయా అని అడుగుతుంది. అప్పుడు పార్వతికి శివుడు మరణం సంభవించే ముందు కనిపించే సంకేతాల గురించి ఈ విధంగా వివరించాడు.
మరణం సంభవించే ముందు మనిషి కంటికి ఈ ప్రకృతి అంతా బంగారు రంగులో మెరుస్తూ ఆ మనిషిని ఆహ్వానిస్తూ ఉంటుంది.మనిషి 15 రోజుల్లో చనిపోతాడు అనగా తన పితృ దేవతలంతా పదే పదే కలలో కనిపించి తమతో రమ్మని పిలుస్తూ ఉంటారు. ఏమి తిన్నా ఏమి తాగినా సరిగా రుచించవు. ఎంతో ఇష్టమైన ఆహార పదార్థమైనా వికారంగా కనిపిస్తుంది.నాలుక ఉబ్బుతుంది.పంటి చిగుళ్ల కు చీము పడుతుంది. తన ప్రతిబింబాన్ని నూనెలో, నీళ్లలో సరిగ్గా చూసుకోలేడు. ఆఖరికి నీడ కూడా తల లేని మొండెంగా కనిపిస్తుంది.శరీరం గాలిలో తేలిపోతున్నట్లు ఉండి పై నుండి ఎవరో పిలిచినట్లు అనిపిస్తుంది.
ఆలోచనా శక్తి నశించి, విచక్షణ రహితంగా చేస్తారు. మనిషి ఆరోజు చనిపోతాడు అనే టైంలో ఆ ఇంటి పై నుంచి తీతువుపిట్ట ఎగురుకుంటూ వెళ్తుంది. కుక్కలు పదేపదే తల కిందకి వంచి ఏడుస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. ఇలా మృత్యువు ముంచుకొస్తున్న సమయంలో మనిషి రెండు కళ్ళలో నుంచి ఒక కాంతి వలయం బయటకు వస్తుంది.ఆ కాంతి వలయం నుండి యామభటులు బయటకు వచ్చి మీ ఆత్మను యమపాశం తో పెకిలించి ఒక భరిణే లో ఉంచుకొని యమలోకానికి పయనమవుతారు. ఇలా మనిషి చనిపోయే ముందు అతనికి అనేక సంకేతాలు కనిపిస్తాయని పరమశివుడు పార్వతీదేవికి వివరించాడు.