తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగి లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది శోభన్ బాబు. అమ్మాయిల కలల రాకుమారుడిగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఎన్నో సినిమాల్లో చేసి ఇండస్ట్రీలో సూపర్ హిట్లు కొట్టాడు. ఇంతటి స్టార్డం ఉన్నా కానీ అతని కుటుంబం మాత్రం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. అలాంటి ఈ సీనియర్ హీరో వయసు పెరగడంతో కాస్త సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత అనేక ఆఫర్లు వచ్చినా ఆయన నటించడానికి ఒప్పుకోలేదు. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందని తెలుస్తోంది.
అయితే పవన్ మరియు శోభన్ బాబు కాంబినేషన్ లో ఒక మూవీ రావాల్సి ఉండేది. కానీ అది ఆగిపోయింది దానికి కారణం ఏంటో ఒక సారి చూద్దాం. డైరెక్టర్ భీమిలి శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం సుస్వాగతం. ఈ సినిమా అప్పట్లో ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను తెగ ఆకట్టుకుంది. ఇందులో ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి. ఇందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తండ్రి పాత్ర చాలా కీలకం. ఈ తండ్రి పాత్రలో రఘువరన్ నటించి మెప్పించారని చెప్పవచ్చు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా దర్శకుడు శోభన్ బాబును సంప్రదించారట. కానీ శోభన్ బాబు అప్పటికే సినిమాలకు గుడ్ బై చెప్పడం తో పవన్ తో నటించడానికి ఒప్పుకోలేదట.
అసలు కారణం ఏంటంటే తనను ఎప్పుడూ అభిమానులు హీరోగా అందంగా ఉండే శోభన్ బాబుగా మాత్రమే గుర్తుపెట్టుకోవాలని అన్నారట. తన వయసు పెరగడంతో సినిమాలకు గుడ్బై చెప్పారు కానీ వేరే పాత్రలు అసలు చేయానని ఫిక్స్ అయ్యాడట. అందుకే ఈ పాత్ర కాస్త రఘువరన్ దగ్గరికి వెళ్ళింది. దీంతో రఘువరన్ ఈ మూవీలో చాలా అద్భుతంగా నటించారు. ఒకవేళ శోభన్బాబు ఒప్పుకొని ఉంటే శోభన్ బాబు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఈ పాత్ర ఎలా ఉండేదో మీరు ఓ సారి ఊహించుకోండి.