వినోదం

Uday Kiran : అత‌డు సినిమాను ఉద‌య్ కిర‌ణ్ వ‌ద్ద‌న్నాడా ? ఎందుకు ?

Uday Kiran : మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వ‌చ్చిన చిత్రం.. అత‌డు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. త‌న‌దైన శైలిలో త్రివిక్ర‌మ్ ఈ మూవీని ముందుండి న‌డిపించారు. అలాగే మ‌హేష్ యాక్ష‌న్ కూడా అదిరిపోయింది. ఫైట్స్ కూడా తెగ న‌చ్చేశాయి. ఇందులో మ‌హేష్‌కు జోడీగా త్రిష న‌టించింది. కామెడీ కూడా హైలైట్ అయింది. అయితే వాస్త‌వానికి ఈ మూవీని ముందుగా ఉద‌య్ కిర‌ణ్‌తో చేయాల‌ని త్రివిక్ర‌మ్ అనుకున్నార‌ట‌. కానీ ఉద‌య్ కిర‌ణ్ ఈ మూవీని తిర‌స్క‌రించాడు.

అప్ప‌ట్లో త్రివిక్ర‌మ్‌, త‌రుణ్ చేసిన నువ్వే నువ్వే ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ మూవీ త‌రువాత అత‌డు సినిమాను త్రివిక్ర‌మ్.. ఉద‌య్ కిర‌ణ్ తో చేద్దామ‌ని అనుకున్నారు. నిర్మాణ సంస్థ జ‌య‌భేరి వారు ఉద‌య్ కిర‌ణ్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ ఎంత వీలు చేసుకున్నా కాల్ షీట్స్ కుద‌ర‌లేదు. దీంతో ఉద‌య్ కిర‌ణ్ ఈ మూవీని చేయ‌లేన‌ని చెప్పాడు. అలాగే తీసుకున్న అడ్వాన్స్ ను కూడా ఉద‌య్ వెన‌క్కి ఇచ్చేశాడు. అయితే ఈ మూవీని ప‌వ‌న్‌తోనూ చేద్దామ‌ని త్రివిక్ర‌మ్ అనుకున్నార‌ట‌. కానీ ఆయ‌న డేట్స్ కూడా అడ్జ‌స్ట్ కాలేదు.

why uday kiran rejected athadu movie

ఇక అప్ప‌ట్లో మ‌హేష్ బాబు నాని సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌న‌ను త్రివిక్ర‌మ్ క‌లిసి స్టోరీ చెప్పారు. దీంతో మ‌హేష్ ఓకే అనేశారు. అలా అత‌డు ప్రారంభ‌మైంది. ఈ మూవీ చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ అయింది. అయితే మ‌రోమారు త్రివిక్ర‌మ్‌తో క‌లిసి మ‌హేష్ ఖ‌లేజా మూవీ చేశారు. కానీ అది ఫ్లాప్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. అయిన‌ప్ప‌టికీ త్రివిక్ర‌మ్ ఆ త‌రువాత ఇత‌ర హీరోల‌తో అనేక సినిమాలు చేయ‌గా.. వాటిల్లో చాలా వ‌ర‌కు సినిమాలు హిట్లుగా నిలిచాయి.

Admin

Recent Posts