వ్యాయామం

వాకింగ్ చేసేట‌ప్పుడు పొర‌పాటున ఇలా చేయ‌కండి.. రిస్క్‌లో ప‌డ‌తారు..!

న‌డ‌క అనేది మ‌న ఆరోగ్యానికి చాలా మేలు చేకూరుస్తుంది. ఫిట్‌గా ఉండ‌డానికి అంద‌రు జిమ్‌ల‌కి వెళ్లి ఎక్స‌ర్‌సైజ్‌లు చేయ‌లేరు. అయితే వర్కౌట్ చేయడానికి ఎలాంటి సౌకర్యాలు లేనప్పట్నుంచీ కూడా చాలా మంది నడక ద్వారా ఫిట్‌నెస్ గోల్స్ రీచ్ అయ్యేవారు. రాను రాను సౌకర్యాలు పెర‌గ‌డం వ‌ల‌న‌ నడక తగ్గింది. రోజుకి కనీసం 10 వేల అడుగులు నడవడం మంచిదని చెబుతున్నారు. అది ఉదయమైనా, సాయంత్రమైనా, పార్కులు, బహిరంగా ప్రదేశాలు ఇలా ఎక్కడైనా నడిస్తే చాలా మంచిదని చెబుతున్నారు. నడకను సరిగ్గా చేసినప్పుడే దాని ప్రయోజనాలు లభిస్తాయి. అందువల్ల, మీరు వాకింగ్‌కు వెళ్లినప్పుడు, కొన్ని విషయాలను గుర్తుంచుకోండి.

మీరు నడక యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, ముందుగా మీ శరీర భంగిమను మెరుగుపర‌చుకోవాలి. నడిచేటప్పుడు మీ తలని పైకి పెట్టండి. బాడీని వంచొద్దు. భుజాన్ని క్రిందకి, వెనక్కి ఉంచండి. నడుస్తున్నప్పుడు వంగిపోవడం, ముందుకు వంగడం చేయొద్దు. దీని వల్ల మీకు సమస్య వస్తుంది. బాడీని రిలాక్స్‌గా ఉంచండి. మెల్లిగా స్టార్ట్ చేసి నడకవేగాన్ని పెంచండి. నడుస్తున్నప్పుడు చేతులు ఊపకుండా ఉండడం చాలా మందికి అలవాటు. ఈ నడక వల్ల పూర్తి ప్రయోజనం వారికి అందడం లేదు. వాస్తవానికి, నడుస్తున్నప్పుడు చేతులు ఊపడం మంచిదని భావిస్తారు. ఇది నడక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు శరీర సమతుల్యతను కూడా కాపాడుతుంది.

do not make these mistakes while walking

నడవడానికి సరైన పాదరక్షలు కూడా అవసరం. మీరు సరైన పాదరక్షలు ధరించి నడవకపోతే, అది సమస్యలను పెంచుతుంది. దీని వల్ల కడుపు సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. పాదాలపై కూడా బొబ్బలు రావచ్చు. నడిచేటప్పుడు శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఇది అలసట మరియు బలహీనతని కలిగించదు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచకపోవడం వల్ల కండరాలు అలసట మరియు తిమ్మిర్లు వస్తాయి. అందువల్ల, రోజంతా తగినంత నీరు త్రాగాలి. నడిచేటప్పుడు కొందరు కిందకి చూసి నడుస్తుంటారు. అదే సమయంలో కొందరు మొబైల్ వాడుతూనే ఉంటారు. అటువంటి పరిస్థితిలో, నడక వ‌ల‌న ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌కుండా న‌ష్టం చేకూరుతుంది. ఇది వెన్నునొప్పి మరియు శరీరంలో దృఢత్వం కలిగిస్తుంది. అందువల్ల, నడుస్తున్నప్పుడు దానిపైనే పూర్తి దృష్టి పెట్టండి.

Sam

Recent Posts