Carrot And Beetroot Juice In Winter : క్యారెట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. క్యారెట్ ని తీసుకోవడం వలన, అనేక ఉపయోగాలు ఉంటాయి. అలానే, బీట్రూట్ కూడా ఆరోగ్యానికి మంచిది. బీట్రూట్ క్యారెట్ రెండు కూడా మనకి సులభంగా దొరుకుతాయి. ఈ మధ్యకాలంలో, చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఉదయం నుండి పనులు చేసుకోవడం, మధ్యాహ్నం వచ్చేసరికి నీరసం, అలసట వంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఈ జ్యూస్ ని తీసుకుంటే నీరసం, అలసట ఈజీగా తగ్గుతుంది.
హుషారుగా కూడా ఉండొచ్చు. రోజంతా అలసట, నీరసం లేకుండా హుషారుగా పనులు చేసుకోవాలన్నా ఎనర్జిటిక్ గా ఉండాలన్న ఈ జ్యూస్ ని, తీసుకోవడం మంచిది. ఉదయం సమయంలో దీనిని తీసుకుంటే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని పొందడానికి అవుతుంది. రాత్రి టైంలో ఐదు బాదం పప్పుల్ని నీళ్లలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం బాదంపప్పులు తొక్కలు తీసేసి, పక్కన పెట్టుకోండి. ఈ బాదం తో పాటుగా వాల్నట్స్ ని కూడా ఒక నాలుగు పక్కన పెట్టుకోండి.
ఒక క్యారెట్, ఒక బీట్రూట్ తీసుకుని శుభ్రంగా కడిగేసి, తొక్క తీసేసి ముక్కలు కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని కొద్దిగా తేనె కూడా వేసుకుని, ఒక కప్పు నీళ్లు వేసుకుని, మిక్సీ పట్టేసుకోవాలి. జ్యూస్ లాగా మీరు రెడీ చేసుకోవాలి. దీన్ని ప్రతిరోజు ఉదయం తాగితే రోజంతా కూడా ఎనర్జిటిక్ గా ఉండడానికి అవుతుంది.
కావాల్సిన శక్తి కూడా మీకు లభిస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా మీరు ఈజీగా పెంచుకోవచ్చు. దీన్ని తాగడం వలన సీజనల్ వ్యాధులు కూడా రావు. శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు అన్ని కూడా క్లీన్ అయిపోతాయి. రక్తహీనత సమస్య కూడా ఉండదు. కంటికి సంబంధించిన సమస్యలు కూడా అస్సలు ఉండవు. కాలేయానికి కూడా సమస్యలు వుండవు. ఆరోగ్యంగా ఉండొచ్చు. చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తుంది.