Dry Ginger : అన్నం మొద‌టి ముద్ద‌లో దీన్ని క‌లిపి 7 రోజులు తినండి.. జీర్ణాశ‌యం మొత్తం క్లీన్ అవుతుంది..!

Dry Ginger : మన వంట ఇంట్లో అనేక పదార్థాలు ఉంటాయి. కానీ మనం వాటిని కేవలం వంటల కోసమే ఉపయోగిస్తుంటాం. అయితే ఆయుర్వేదం ప్రకారం ఆ పదార్థాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల వాటితో అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక అలాంటి పదార్థాల్లో శొంఠి ఒకటి. దీన్ని చాలా మంది తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటారు. అయితే దీంతో అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. శొంఠి ద్వారా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

amazing health benefits of Dry Ginger

అల్లాన్ని ఎండబెట్టి శొంఠిని తయారు చేస్తారు. అల్లంపై పొట్టు తీసి దాన్ని సున్నపు తేటలో ముంచి తరువాత ఎండబెడతారు. దీంతో శొంఠి తయారవుతుంది. ఆయుర్వేదంలో శొంఠికి ప్రాధాన్యత ఉంది. దీన్ని పలు వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. అన్నంలో మొదటి ముద్దగా శొంఠి పొడిని కలుపుకుని తింటే ఎన్నో వ్యాధుల నుంచి బయట పడవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.

అన్నంలో మొదటి ముద్దగా శొంఠి పొడిని కలిపి తింటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. ఆకలి లేని వారు ఇలా తింటే ఆకలి పెరుగుతుంది. అజీర్ణం, గ్యాస్ స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది. క్ర‌మం త‌ప్ప‌కుండా తింటే జీర్ణాశ‌యం మొత్తం క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది. అలాగే రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా శొంఠి పొడి, తేనె కలిపి తాగుతుంటే.. అధిక బరువు తగ్గుతారు.

జలుబు సమస్య ఉన్నవారు ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా శొంఠి పొడి, మిరియాల పొడి కలిపి తాగాలి. దీంతో జలుబు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం సమస్యలు తగ్గుతాయి. అలాగే మైగ్రేన్‌ ఉన్నవారికి కూడా ఇది పనిచేస్తుంది. తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. శొంఠి పొడి కొద్దిగా తీసుకుని అందులో బెల్లం కలిపి తిన్నా మైగ్రేన్‌ సమస్య నుంచి బయట పడవచ్చు.

శొంఠి పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. దాన్ని నుదుటిపై లేపనంగా రాయాలి. దీంతో తీవ్రమైన తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

శొంఠితో తయారు చేసిన టీ తాగితే వాత, పిత్త, కఫ దోషాలు పోతాయి. శొంఠి పొడిలో తేనె కలిపి తీసుకుంటే వెక్కిళ్లు తగ్గుతాయి. శొంఠి, ధనియాలు వేసి కాచిన కషాయం తాగితే వాత సంబంధమైన నొప్పులు తగ్గుతాయి.

శొంఠి, వాము, సైంధవ లవణంలను సమాన భాగాల్లో తీసుకుని పొడి చేయాలి. అందులో నిమ్మరసం కలిపి ఎండబెట్టాలి. తరువాత దాన్ని చిన్న ఉండలుగా చేయాలి. ఉదయం, సాయంత్రం ఒక్కో ఉండ చొప్పున తీసుకోవాలి. దీంతో గ్యాస్‌, అజీర్ణం, వికారం, వాంతులు, కడుపులో నులి పురుగులు తదితర సమస్యలన్నీ తగ్గుతాయి.

శొంఠి పొడి, బెల్లం పొడిలను సమాన భాగాల్లో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని సీసాలో నిల్వ చేసుకోవాలి. ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో ఆ మిశ్రమాన్ని అర టేబుల్‌ స్పూన్‌ మోతాదులో కలిపి ఉదయం పరగడుపునే తాగాలి. అలాగే సాయంత్రం 6 గంటల సమయంలో తీసుకోవాలి. దీంతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

అయితే శొంఠికి వేడి చేసే గుణం ఉంటుంది. కనుక దీన్ని తక్కువ మోతాదులో వాడుకోవాలి. అలాగే వేడి శరీరం ఉన్నవారు దీన్ని తీసుకోరాదు.

Share
Admin

Recent Posts