Thella Galijeru : శ‌రీరంలో దెబ్బ తిన్న అవ‌య‌వాల‌ను రిపేర్ చేసే మొక్క‌.. ఎక్క‌డ కనిపించినా వ‌ద‌లొద్దు..!

Thella Galijeru : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే ఔష‌ధ మొక్క‌లు అనేకం ఉన్నాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియ‌దు. అలాంటి మొక్క‌ల్లో తెల్లగ‌లిజేరు మొక్క ఒక‌టి. దీన్నే సంస్కృతంలో పునర్నవ అని కూడా పిలుస్తారు. అంటే.. మళ్ళీ కొత్తగా సృష్టించేద‌ని అర్థం వ‌స్తుంది. ఈ మొక్క మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరుగుతుంది. సుల‌భంగా ల‌భిస్తుంది. ఆయుర్వేద ప్ర‌కారం ఈ మొక్క‌తో అనేక వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీంట్లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. అవి మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి.

wonderful health benefits of Thella Galijeru

మ‌న శ‌రీరంలో ఏదైనా అవ‌య‌వం దెబ్బ తింటే దాన్ని మ‌ళ్లీ ఈ మొక్క పున‌రుజ్జీవింప‌జేస్తుంది. అందుక‌నే దీనికి పునర్న‌వ అని పేరు వ‌చ్చింది. పున‌ర్న‌వ ఆకును మ‌నం ఉప‌యోగించాల్సి ఉంటుంది. దీంతో అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.

తెల్లగ‌లిజేరు మ‌న శ‌రీరానికి ఎంతో చ‌లువ చేస్తుంది. శరీరంలో అధికంగా వేడి ఉన్న‌వారు ఈ మొక్క‌ను వాడ‌డం వ‌ల్ల ఫ‌లితం ఉంటుంది. శ‌రీరంలో ఉండే వేడి మొత్తం పోతుంది. ఈ మొక్క ఆకుల్లో యాంటీ మైక్రోబియ‌ల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని తీసుకుంటే అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. శ‌రీరంలోని వేడి త‌గ్గిపోయి చ‌ల్ల‌గా మారుతుంది.

శ‌రీరంలో వాతం, కఫం అధికంగా ఉన్న‌వారు, మ‌ల‌బ‌ద్ద‌కం, పైల్స్ స‌మ‌స్య‌ల‌కు తెల్లగ‌లిజేరు మొక్క ఆకు ఎంతో అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీన్ని కూర‌గా కూడా వండుకుని తిన‌వ‌చ్చు. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

తెల్లగ‌లిజేరు మొక్క వేర్ల‌ను తెచ్చి శుభ్రం చేసి దంచాలి. అనంత‌రం దాన్ని నీటిలో వేసి మ‌రిగించాలి. దీంతో క‌షాయం త‌యార‌వుతుంది. దాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఒక్కోసారి 30 ఎంఎల్ మోతాదులో తాగాలి. దీంతో మూత్రాశ‌యంలో ఉండే రాళ్లు క‌రిగిపోతాయి.

తెల్లగ‌లిజేరు మొక్క ఆకుల‌తో క‌షాయం త‌యారు చేసి అందులో 20 గ్రాముల మేర అల్లం ర‌సం క‌లిపి పూట‌కు 30 ఎంఎల్ మోతాదులో తీసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు తీసుకుంటుంటే ఆస్త‌మా త‌గ్గుతుంది.

తెల్లగలిజేరు ఆకుల‌ రసం, పాలు, నీళ్ల‌ను మూడు సమాన భాగాల్లో తీసుకోవాలి. అనంతరం వాటిని మరిగిస్తూ పాలు మాత్రమే మిగిలి ఉండే వ‌ర‌కు వేచి చూడాలి. ఆ తరువాత గోరువెచ్చగా ఉండ‌గానే ఆ మిశ్ర‌మాన్ని తాగేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే ఎలాంటి జ్వ‌రం అయినా స‌రే త‌గ్గుతుంది.

తెల్లగలిజేరు ఆకుల‌ను దంచి ఆముదంలో వేయించాలి. అనంతరం వేడిగా ఉండ‌గానే ఆ మిశ్ర‌మాన్ని బోద‌కాలు మీద వేసి కట్టు క‌ట్టాలి. ఇలా రోజూ చేస్తుంటే ఆ స‌మ‌స్య త‌గ్గుతుంది.

తెల్లగలిజేరు ఆకుల రసం, మిరియాల పొడిల‌ను తీసుకుని స‌మాన భాగాల్లో క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని 5గ్రాముల మోతాదులో తీసుకోవాలి. దీంతో ఎంత సుదీర్ఘ‌కాలం పాటు ఉన్న ద‌గ్గు అయినా స‌రే వెంట‌నే త‌గ్గుతుంది.

తెల్లగలిజేరు ఆకుల రసాన్ని పలుచని మజ్జిగలో కలిపి తీసుకోవాలి. దీంతో రక్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌యట ప‌డ‌వ‌చ్చు. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. దీన్ని క‌నీసం 90 రోజుల పాటు వాడాల్సి ఉంటుంది. అలాగే తెల్లగలిజేరు ఆకుల‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స‌రిగ్గా వినియోగం అవుతుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

Editor

Recent Posts