Dolo 650 : గత 2 సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అనేక కోట్లాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ వైరస్ ప్రభావం ఇప్పటికీ ఇంకా తగ్గలేదు. కొత్త కొత్త రూపాల్లో ఈ వైరస్ మానవాళిపై దాడి చేస్తూనే ఉంది. మన దేశంలో కరోనా మూడో వేవ్ ప్రభావం ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే దీని వల్ల పెద్ద ముప్పు లేదని స్పష్టమైంది. ఇక కరోనా సమయంలో చాలా మంది డోలో 650 ట్యాబ్లెట్లను వేసుకున్నారు. ఈ క్రమంలోనే గత 2 ఏళ్లుగా మన దేశంలో అత్యంత భారీ స్థాయిలో అమ్ముడైన ట్యాబ్లెట్‌గా డోలో 650 నిలిచింది. అయితే డోలో 650 ఎందుకంత పాపులర్ అయింది ? అంటే..
చాలా మందికి డోలో 650 పేరు సులభంగా గుర్తుండిపోతుంది. చదువురాని వారు సైతం సులభంగా గుర్తుంచుకోగలరు. అందుకనే డోలో 650 ట్యాబ్లెట్ పాపులర్ అయింది. జ్వరం వచ్చినా, ఒళ్లు నొప్పులు ఉన్నా.. వారు వెంటనే మెడికల్ షాపుకు వెళ్లి డోలో ఇవ్వమంటారు. అంతలా ప్రజల నోళ్లలో ఈ పేరు నానిపోయింది. అందుకనే ఈ ట్యాబ్లెట్ ఎంతో పాపులర్ అయింది.
కరోనా సమయంలో స్వల్ప, మధ్యస్థ లక్షణాలు ఉన్నవారికి, జ్వరం ఉన్నవారికి డోలో 650 ట్యాబ్లెట్లను ఇచ్చారు. ప్రభుత్వాలు కూడా దీన్ని పంపిణీ చేశాయి. దీంతో జనాల్లోకి సహజంగానే డోలో 650 చేరిపోయింది. రోజూ కూరగాయలు కొన్నట్లు వీటిని కొని వేసుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం చిన్న పిల్లలను అడిగినా డోలో ట్యాబ్లెట్ ఎందుకు పనిచేస్తుందో చెబుతారు. అంతలా ఈ ట్యాబ్లెట్ పాపులర్ అయింది.
ఇక దీని ధర కూడా చాలా తక్కువే. 15 ట్యాబ్లెట్లు ఉండే ఒక స్ట్రిప్ ధర రూ.30గా ఉంది. ధర తక్కువ కనుక జ్వరం వచ్చినప్పుడు వేసుకోవచ్చులే అని చెప్పి చాలా మంది ఇప్పటికీ పెద్ద ఎత్తున ఇళ్లలో కొని పెట్టుకుంటున్నారు. ఏ ఇంటికి వెళ్లినా.. డోలో 650 ట్యాబ్లెట్లు స్టాక్ కనిపిస్తున్నాయి. కరోనా భయం, సీజనల్ వ్యాధుల భయంతో చాలా మంది ట్యాబ్లెట్లు దొరకవేమోనని చెప్పి ముందుగానే కొని ఇంట్లో దాచుకుంటున్నారు. అందువల్లే డోలో ట్యాబ్లెట్లు భారీ స్థాయిలో అమ్ముడయ్యాయి. డోలో ట్యాబ్లెట్లు ఆ విధంగా పాపులర్ అయ్యాయి.
అయితే వీటిని రోజుకు 4 డోసులకు మించి వేసుకోరాదు. 6 గంటలకు ఒకటి చొప్పున రోజుకు వీటిని 4 వేసుకోవచ్చు. అంతకు మించితే దుష్పరిణామాలు కలుగుతాయి.