Chiranjeevi : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో నెలకొన్న సందిగ్ధతను తొలగించాలని, టాలీవుడ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యే పలువురు హీరోలతో కలిసి వెళ్లి సీఎం జగన్‌తో సమావేశమై అన్ని సమస్యలపై సవివరంగా చర్చించిన విషయం విదితమే. అయితే ఈ విషయంలో చిరంజీవిపై ఓ వర్గం వారు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని తెలుస్తోంది.
సీఎం జగన్‌ను కలిసిన వెంటనే ఏపీ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేస్తుందని చిరంజీవి భావించారని.. కానీ అలా జరగకపోవడంతో చిరంజీవి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని వార్తలు వచ్చాయి. ఆయన తన నివాసానికి వెళ్లి పలువురు హీరోలు, దర్శకులతో ఇదే విషయమై చర్చించి విచారం వ్యక్తం చేశారట. ఇలా కొన్ని సోషల్ ఖాతాల్లో వార్తలు వచ్చాయి. దీంతో అందరూ ఇది నిజమేనని అనుకున్నారు. అయితే ఇదంతా చిరంజీవిపై జరుగుతున్న దుష్ప్రచారమేనని తేలింది.
జగన్‌ను కలిసిన అనంతర చిరంజీవి అసంతృప్తిగా ఉన్నారనే అసత్య వార్తలను కొందరు కావాలనే పనిగట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారట. వాస్తవానికి సీఎం జగన్ ఇచ్చిన హామీలకు చిరంజీవి, ఇతర టాలీవుడ్ పెద్దలు సంతోషంగానే ఉన్నారట. ఎట్టకేలకు త్వరలో జీవో విడుదల అవుతుంది కనుక.. వారందరూ ఆనందం వ్యక్తం చేశారట. కానీ చిరంజీవి అసంతృప్తితో ఉన్నట్లు వార్తలను ప్రచారం చేశారు. అయితే అవన్నీ అబద్దాలేనని తేలింది.