Green Tea : గ్రీన్ టీ చాలా ఆరోగ్యకరమైన పానీయం అని అందరికీ తెలిసిందే. పొట్ట దగ్గరి కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ ఎంతగానో సహాయపడుతుంది. గ్రీన్ టీని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కూడా కరుగుతుంది. బరువు తగ్గే ప్రక్రియను గ్రీన్ టీ వేగవంతం చేస్తుంది. దీని వల్ల అధిక బరువు కూడా త్వరగా తగ్గుతారు. అయితే గ్రీన్ టీని సరైన రీతిలో తయారు చేసుకుని తాగాల్సి ఉంటుంది. దీని వల్ల కేవలం 20 రోజుల్లోనే పొట్ట దగ్గరి కొవ్వును కరిగించుకోవచ్చు.
చాలా మంది గ్రీన్ టీని తప్పుగా తయారు చేస్తుంటారు. ముందుగా నీళ్లను మరిగించి అందులో గ్రీన్ టీ ఆకులను లేదా బ్యాగ్స్‌ను వేసి తరువాత గ్రీన్ టీని తాగుతుంటారు. వాస్తవానికి వేడి వేడి నీళ్లో గ్రీన్ టీ పొడి లేదా టీ బ్యాగ్స్ ను వేయడం వల్ల వాటిల్లో ఉండే కాటెకిన్ అనే సమ్మేళనం శక్తి తగ్గిపోతుంది. దీంతో అలాంటి గ్రీన్ టీని తాగినా పెద్దగా ప్రయోజనం ఉండదు. కనుక గ్రీన్ టీని తయారు చేయాలంటే ఒక పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. అదేమిటంటే..
ముందుగా నీళ్లను మరిగించాలి. నీరు బాగా మరిగాక వాటిని 10 నిమిషాల పాటు చల్లార్చాలి. అనంతరం ఆ నీటిలో గ్రీన్ టీ పొడి లేదా బ్యాగ్స్ ను వేసి బాగా తిప్పాలి. దీంతో గ్రీన్ టీ తయారవుతుంది. తరువాత ఆ పొడిని వడకట్టి, బ్యాగ్ వేస్తే దాన్ని తీసేసి.. అనంతరం గ్రీన్ టీని తాగాలి. ఇలా గ్రీన్ టీని తయారు చేసి తాగాల్సి ఉంటుంది. దీంతో శరీరానికి గ్రీన్ టీలోని పోషకాలు, సమ్మేళనాలు బాగా లభిస్తాయి. అధికంగా ప్రయోజనం కలుగుతుంది.
గ్రీన్ టీలో ఉండే కాటెకిన్ అనే సమ్మేళనం అధిక బరువును తగ్గించడంలో సహాయ పడుతుంది. అయితే గ్రీన్ టీలో నీరు వేడిగా ఉంటే ఈ సమ్మేళనం సరిగ్గా లభించదు. కనుక గోరు వెచ్చగా ఉండే నీటితో గ్రీన్ టీని తయారు చేసుకుని తాగాల్సి ఉంటుంది. ఇలా రోజూ గ్రీన్ టీని తయారు చేసుకుని 20 రోజుల పాటు రోజుకు 3 కప్పుల గ్రీన్ టీని తాగాలి.
దీని వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. అయితే 3 కప్పులకు మించి మాత్రం గ్రీన్ టీని తాగరాదు. తాగితే అందులో ఉండే కెఫీన్ నెగెటివ్ ప్రభావాలను కలిగిస్తుంది. కాబట్టి 3 కప్పులకు మించకుండా గ్రీన్ టీని తాగితే లాభాలను పొందవచ్చు.
గ్రీన్ టీని రోజూ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. పొట్ట దగ్గరి కొవ్వు కూడా కరిగిపోతుంది. అయితే వ్యాయామం చేస్తూ గ్రీన్ టీని ఇలా రోజూ తాగితే మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.