Regu Pandlu : చలికాలం సీజన్ ప్రారంభం అయ్యాక మనకు ఎక్కడ చూసినా రేగు పండ్లు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలల్లో ఇవి మనకు ఎక్కువగా లభిస్తాయి. సంక్రాంతి సమయంలో రేగు పండ్లను భోగి రోజున భోగి పండ్లుగా చిన్నారులపై పోస్తారు. దీంతో వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. అయితే రేగు పండ్లను తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రేగు పండ్లను తేనె లేదా చక్కెరతో కలిపి తింటే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా శరీరంలో పలు సమ్మేళనాలు చేరుతాయి. అవి మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. దీంతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
2. రేగు పండ్లను తరచూ తినడం వల్ల సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటివి తగ్గిపోతాయి. ఈ పండ్లలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు వ్యాధులను రాకుండా చూస్తాయి.
3. మలబద్దకం, ఇతర జీర్ణ సమస్యలు ఉన్నవారు రోజుకు 3 పూటలా పూటకు గుప్పెడు రేగు పండ్లను తింటే చాలు.. ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. రేగు పండ్లను తినడం వల్ల సన్నగా ఉన్నవారు బరువు పెరగవచ్చు. ఇవి కండరాలకు బలాన్నిస్తాయి. శక్తిని అందిస్తాయి. దీంతో బరువు పెరుగుతారు.
5. రేగు పండ్లను తరచూ తినడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. లివర్‌లోని వ్యర్థాలు బయటకు పోతాయి.
6. రేగు పండ్లను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లను తట్టుకునే శక్తి లభిస్తుంది.
7. పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు రేగు పండ్లలో ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. రక్తం బాగా తయారవుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది.
8. నిద్రలేమి సమస్య ఉన్నవారు రేగు పండ్లను తింటే గాఢమైన నిద్రలోకి జారుకుంటారు. నిద్ర బాగా పడుతుంది.
9. రేగు పండ్లను తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
అయితే ఈ పండ్ల వల్ల కొందరికి మలబద్దకం ఏర్పడవచ్చు. కొందరికి నోట్లో పొక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు వీటిని తినకపోవడమే మంచిది.