food

జాంగ్రీ కి జిలేబి కి ఏమిటి తేడా ?

తేడాలు సరే సామ్యాలు ఏంటి. రెండు తియ్యగా ఉంటాయి, అంతేనా.. అబ్బో చాలా కష్టం అంటారా చెప్తాను. ప్రధానం గా 6 తేడాలు ఉన్నాయి. 1.జన్మ స్థలం : జిలేబీ లు పర్షియా నుంచి వచ్చాయట .(నాక్కూడా తెలీదు). జాంగ్రీలు ఉత్తర భారతదేశం లోనే పుట్టాయట.జిలేబి ని నార్త్ లో ఇమార్తి అంటారు.ప్రాచీన చరిత్ర లో దీన్ని జాల వల్లిక /కుందాలిక అనే వాళ్ళు. 2.ముడి సరుకు: ఎంత ఒకేలా ఉన్నా,జాంగ్రీ మినప్పప్పు తో ,జిలేబి మైదా తో తయారవుతాయి. 3.పులిసే సమయం :జిలేబి పిండి పెరుగు తో రాత్రంతా పులియ బెట్టి చేస్తే, జాంగ్రీ గారికి పులిసే అవసరం లేదు.

4.రూపం :జిలేబీ ల ను వేసే వాడి చేతి లాఘవం ప్రకారం మెలికలు ఉంటాయి. మలయాళం అక్షరాల లాగ.కానీ జాంగ్రీ ఒక పువ్వు లో దళాలు విచ్చ్కున్నట్లు గా దేనికి దానికి పొందిక గా ఉండాల్సిందే. 5.ఆరోగ్యం :రెండు నూనెలో మునిగి తర్వాత పంచదార పాకం లో తేలేవి అయినా మైదా కంటే మినప పప్పు కొంచెం ఎక్కువ ఆరోగ్యం అని జాంగ్రీ ప్రియుల ఉవాచ.నమ్మకండి. 6.కరకర : రెండిట్లో కి జిలేబి కొంచెం వేడిగా తినాలి , అందుకే కరకర మంటాయి. అయితే జాంగ్రీ ఇంకొంచెం మెత్తగా ,లొపల జూ సీ గా ,పాకం లోపల ఉంటుంటే నె బాగుంటుంది.

jalebi vs jangiri what are the differences

ఇంతేనా అనకండి. మీకు ఇంకా తెలిస్తే చెప్పండి. ఇలా మంది జిలేబి మినప పిండి తోనే అంటున్నారు. నేను చదవకుండా, వెతకకుండా రాయను. sailas kitchen, అమ్మచేతి వంటలు youtube వీడియో లు చూడండి. ఇంకా నెట్ అంతా వెతకండి. మైదా (ఆల్ పర్పస్ ఫ్లోర్), ఇంకా కార్న్ ఫ్లోర్ తో చేసిన రెసిపి కనిపిస్తుంది.

Admin

Recent Posts