food

టీ ఇలా తయారు చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..!

ఉదయం లేవగానే టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. కొందరు ప్రతిరోజుకు ఐదు నుంచి పది సార్లు టీ ని తాగుతారు. టీ తాగడం వల్ల మనసులో ఉత్తేజం కలుగుతుంది. అప్పటివరకు ఉన్న బద్ధకం తొలగిపోతుంది. కొందరు ఉదయాన్నే టీ తాగుతారు. మరికొందరు సాయంత్రం కూడా సేవిస్తూ ఉంటారు. అయితే టీ రుచికరంగా రావాలంటే చాలామంది చాలా రకాలుగా వివిధ పద్ధతులు చెబుతూ ఉంటారు. కొందరు టీ పౌడర్ మార్చాలని చెబితే.. మరికొందరు పాలు చిక్కగా ఉండాలని అంటూ ఉంటారు. అయితే టీ తయారు చేసే విధానంలో కూడా మార్పులు చేస్తే రుచికరంగా ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు కామన్ గా కాకుండా ఈ రకంగా టీ చేయడం వల్ల కొత్త టీ ని చూస్తారని పేర్కొంటున్నారు. అయితే టీ ఎలా తయారు చేయాలంటే?

సాధారణంగా టీ తయారు చేసేటప్పుడు ముందుగా పాలు పోస్తూ ఉంటారు. ఆ తర్వాత టీ పౌడర్ వేసి మరి కాసేపటి తర్వాత తర్వాత పంచదార వేస్తారు. ఆ తర్వాత మొత్తం మరిగించి టీ ని తయారు చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల టీ ఏ మాత్రం రుచికరంగా ఉండదని కొందరు అంటున్నారు. ఒకవేళ రుచికరంగా ఉన్నా కొన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు ఉండవని పేర్కొంటున్నారు. అయితే టీ ని ఇలా తయారు చేయడం వల్ల లాభదాయకంగా ఉంటుందని అంటున్నారు. అది ఎలాగంటే? ముందుగా స్టవ్ పై వేడి నీళ్లను మరిగించాలి. ఆ తర్వాత టీ పౌడర్ ను వేయాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు మరిగించాలి. ఇలా మరిగించిన తర్వాత టీ పౌడర్ ముద్దలాగా అయిన తర్వాత వడగట్టాలి. అప్పుడు టీ పౌడర్ లోని చేదు వెళ్లిపోతుంది. ఇప్పుడు ఆ నీటినీ మరోసారి స్టవ్ పై ఉంచి మరిగిస్తూ అందులో పాలు పోయాలి. ఇలా కొద్దిసేపు మాత్రమే మొత్తం మిశ్రమాన్ని ఉంచాలి. ఈ రకంగా టీ తయారు చేయడం వల్ల చాలా రుచికరంగా ఉంటుందని కొందరు కుకింగ్ స్పెషలిస్టులు చెబుతున్నారు.

make tea in this method for taste

పాలతో కలిపి టీ పౌడర్ ను మరిగించడం వల్ల టీ పౌడర్ లో ఉండే చేదు మొత్తం పాలతో కలిసిపోతుందని.. దీంతో టీ రుచి తేడా ఉంటుందని అంటున్నారు. అందువల్ల ముందుగా టీ పౌడర్ కలిపిన నీళ్లను మరిగించాలి. వీటిని వడగట్టిన తర్వాతనే పాలను కలపాలి. అప్పుడు టీ రుచి అద్భుతంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే ఈ సందేహం చాలా మందికి ఇప్పటికే ఉంది. టీని కాసేటప్పుడు పాలు ముందుగా పోయాలా? లేదా చివరకు పోయాలా అనేది కొంతమంది సందేహ పడుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల టీ రుచికరంగా ఉంటుందని అంటున్నారు. అయితే ఇదే సమయంలో బ్రాండెడ్ టీ పౌడర్ తో పాటు మంచి పాలను కూడా చేర్చుకోవాలని అంటున్నారు. అప్పుడే అనుకున్న విధానంలో టీ అద్భుతంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇలాంటి టీ ని బందువులు వచ్చినప్పుడు త‌యారు చేసి వారిని ఆకట్టుకోవచ్చు.

Admin

Recent Posts