ప్ర‌శ్న - స‌మాధానం

రోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకోవడం మంచిదేనా?

ఒకసారి టిఫిన్ టైమ్‌లో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను. వాడు ఏదో పెద్ద డబ్బా తెరిచాడు. ఏంట్రా ఇది? అన్నా. వాడు: తెలిస్తే ఆశ్చర్యపోతావు! ఇవన్నీ టాబ్లెట్లు! అన్నం తినాలంటే ఒకటి, తినక ముందు ఒకటి, మధ్యలో మరొకటి! ఇవి వేసుకుంటే ఎనర్జీ, యాక్టివ్, సూపర్ ఫిట్ అవుతాం! అన్నాడు. ఒకటే సందేహం!.. ఇన్ని టాబ్లెట్లు తినాల్సిన అవసరం నిజంగా ఉందా? లేకపోతే సోషల్ మీడియా డాక్టర్ల మీద మనకు గుడ్డి నమ్మకమా?

మల్టీవిటమిన్ నిజంగా అవసరమేనా? శరీరానికి విటమిన్లు అవసరం. కానీ ఆహారం ద్వారా తగినన్ని పోషకాలు వస్తే టాబ్లెట్లు అవసరమా? సరిగ్గా తింటే, ఆరోగ్యంగా ఉన్నవాళ్లు మల్టీవిటమిన్ తినాల్సిన పనిలేదు. ఎవరు తినాలి? పోషక లోపం ఉన్నవాళ్లు, వైద్యుల సలహా మేరకు తీసుకోవాల్సినవాళ్లు, గర్భిణులు, ముసలి వాళ్లు, కొన్ని మెడికల్ కండిషన్ ఉన్నవాళ్లు మ‌ల్టి విట‌మిన్ ట్యాబ్లెట్ల‌ను వాడాలి. కానీ, ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఫార్వర్డ్ మెసేజ్ చూసి టాబ్లెట్ మింగేస్తే? అది వైద్యం కాదు, వ్యర్థం! కొన్ని విటమిన్లు ఎక్కువైతే శరీరానికి హానికరం కూడా అవుతాయి. మరి, టాబ్లెట్లు తినాలని ఎవరు చెప్పిస్తున్నారు?

can everybody take multi vitamin tablets

టాబ్లెట్ కంపెనీలు!, ఫార్మా మార్కెటింగ్!, సోషల్ మీడియా డాక్టర్లు! ఇవి తింటే మిమ్మల్ని మీరు కొత్తగా ఫీలవుతారు! అంటారు. కానీ ఆహారం సరిగ్గా తింటే ఇలానే ఫీలవచ్చు కదా! ముందు ఆహారం బాగా తీసుకుందాం! కూరగాయలు, పండ్లు, మిల్లెట్, గింజలు, పెరుగు, పాలు, మాంసాహారం తినేవాళ్లకు చేపలు, మాంసం, ఇది సరిపోతే ఎలాంటి మల్టీవిటమిన్ టాబ్లెట్లు అవసరం ఉండదు! ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహా కాదు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ సలహా తీసుకోవాలి. సోషల్ మీడియా, యూట్యూబ్ డాక్టర్లు చెప్పినదాన్ని గుడ్డిగా నమ్మకండి! టాబ్లెట్ కాదు సార్, మంచి తిండి ముద్దే అసలైన సూపర్ ఫుడ్!

Admin

Recent Posts