అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడాల్సిన ఔషధాలు ఇప్పుడు విషంగా మారి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయి. దేశంలో నకిలీ,నాసిరకం మందులు విచ్చలవిడిగా చెలమాణి అవుతున్నాయి. పారాసిటమాల్ మాత్రల నుంచి కాల్షియం సప్లిమెంట్లు, విటమిన్ ట్యాబ్లెట్ల వరకూ నాసిరకంగానే ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా సేకరించిన దాదాపు 3వేల ఔషధాల నమూనాల్లో 71 మందులు నాణ్యతా ప్రమాణాలకు తగినట్లుగా లేవని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎ్‌ససీవో) వెల్లడించింది. మార్కెట్లో లభించే ఔషధ ఉత్పత్తుల నాణ్యతపై సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. లైఫ్ మ్యాక్స్ కేన్సర్ లేబొరేటరీస్ తయారు చేసిన కాల్షియం సప్లిమెంట్ షెల్కాల్ 500, కాంబినేషన్ డ్రగ్ పాన్ డి, విటమిన్ డి 3 టాబ్లెట్లు డ్రగ్ పరీక్షలో విఫలమయ్యాయి. పారాసిటమాల్, ఆక్సిటోసిన్, ఫ్లూకోనజోల్, విటమిన్ డి 3 వంటి సుపరిచిత ఔషధాలతో కలిపి మొత్తం 71 ఔషధ నమూనాలను ‘నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీస గా గుర్తించారు.
సిడిఆర్ఎ తనిఖీ చేసిన సుమారు 3,000 నమూనాల్లో 1.5% మాత్రమే నాసిరకంగా ఉన్నట్లు తేలింది. నాణ్యతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైన 71ఔషధాలను నివేదికలో వివరించారు. ఈ జాబితాలో ఆల్కెమ్ హెల్త్ సైన్స్, అరిస్టో ఫార్మాస్యూటికల్స్ మరియు హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ వంటి ప్రఖ్యాత కంపెనీలకు చెందిన వివిధ ఉత్పత్తులు ఉన్నాయి.నాణ్యత లేని మందులు ఏంటనేది చూస్తే అందులో టామ్సులోసిన్ అండ్ డుటాస్టరైడ్ టాబ్లెట్స్ (యూరిమాక్స్ డీ), కాల్షియం, విటమిన్ డీ 3 టాబ్లెట్ లు I.P (షెల్కాల్ 500), పాంటోప్రజోల్ గ్యాస్ట్రో-రెసిస్టెంట్, డోంపెరిడోన్ దీర్ఘకాలిక విడుదల క్యాప్సూల్స్ ఐపి (పాన్-డి), నాండ్రోలోన్ డెకానోయేట్ ఇంజెక్షన్ ఐపి 25 మి.గ్రా / మి.లీ, న్యూరోటెమ్-ఎన్ టి ,సెఫురోక్సిమ్ ఆక్సెటిల్ టాబ్లెట్స్ IP 500 mg. లోపెరామైడ్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్స్ IP , ఫ్లోక్సేజెస్-ఓజెడ్ (ఓఫ్లోక్సాసిన్ ఆర్నిడాజోల్ టాబ్లెట్స్ ఐపి) ఉన్నాయి.
వాటితో పాటు మోక్సికా -250 [అమోక్సిసిలిన్ డిస్పెర్సబుల్ టాబ్లెట్స్ ఐపి 250 మి.గ్రా, ఫ్రూసెమైడ్ ఇంజెక్షన్ ఐపి 20 మి.గ్రా, క్లోక్సాసిలిన్ సోడియం క్యాప్సూల్స్ ఐపి 250 మి.గ్రా, ఫ్లోరోమెథోలోన్ ఐ డ్రాప్స్ ఐపి పాన్లిబ్ 40 టాబ్లెట్లు, బి – సిడల్ 625, ట్రిప్సిన్, బ్రోమెలైన్ & రుటోసైడ్ ట్రైహైడ్రేట్ టాబ్లెట్లు [ఫ్లావోషిన్ఔ, సి మాంట్ ఎల్సి కిడ్ 60 మి.లీ (మాంటెలుకాస్ట్ & లెవియోసెటిరిజైన్ డైహైడ్రోక్లోరైడ్ సిరప్), యోగరాజ గుగ్గులు టాబ్లెట్, టెల్మిసార్టన్ ట్యాబ్ ఐపి 40 మి.గ్రా, పాంటోప్రజోల్ బిపి 40 మి.గ్రా.వంటి వాటిని నాణ్యతలేని మందులుగా తేల్చారు. అయితే ఏదైనా నిర్దిష్ట బ్యాచ్ నుండి ఒక ఔషధ నమూనా విఫలమైనంత మాత్రాన ఆ పేరుతో విక్రయించే అన్ని ఉత్పత్తులు నాసిరకంగా ఉన్నాయని అర్థం కాదని, ఎందుకంటే ఆ నిర్దిష్ట బ్యాచ్ మాత్రమే నాసిరకంగా పరిగణించబడుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు డ్రగ్స్ కంట్రోలర్. పనికిరాని మరియు హానికరమైన మందుల వాడకం వలన తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.