హెల్త్ టిప్స్

బాదంనూనె చ‌ర్మానికే కాదు, జుట్టుకు కూడా ఎంతో మంచిది..!

బాదం నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో న్యూట్రీషియన్స్ మరియు విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. బ్యూటీని రెట్టింపు చేసే గుణాలు బాదం నూనె లో ఉన్నాయి. చర్మ సంరక్షణ కోసం దీనిని ఉపయోగించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది చాలా ఎఫెక్టివ్ గా చర్మానికి, జుట్టు సమస్యల‌కి సహాయం చేస్తుంది. చర్మం పై ఉండే మొటిమలు, మచ్చలు, చుండ్రు, డార్క్ సర్కిల్స్ వంటి వాటిని బాదం నూనె తరిమికొడుతుంది.

అలానే చిట్లిన జుట్టుకు కూడా ఇది బాగా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ఇలా బాదం నూనె వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. కాటన్ లో బాదం నూనె వేడి చేసి కళ్ల కింద వలయాలు మీద అప్లై చేస్తే కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలు పూర్తిగా తొలగిపోతాయి. దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి. చర్మంపై ఉండే ముడతలు, ఫైన్ లైన్స్ వంటి వాటిని ఇది ఎంతో సులువుగా తొలగిస్తుంది.

almond oil is better for not only hair but also for skin almond oil is better for not only hair but also for skin

బాదం నూనెలో కొద్దిగా తేనె కలిపి దానిని మీ స్క్రీన్ మీద అప్లై చేస్తే ఈ సమస్య నుండి ఎంతో ఈజీగా బయటపడవచ్చు. చర్మంలో మలినాలను తొలగిస్తుంది కూడా. చర్మ రంధ్రాలలో దాగి ఉన్న మురికిని పోగొట్టడానికి ఇది బెస్ట్ సొల్యూషన్. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కూడా. చుండ్రు, జుట్టు చిట్లకుండా ఉండడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చూసారా బాదం నూనె వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..! మరి దీనిని ఉపయోగించి సమస్యల నుండి బయట పడండి.

Admin

Recent Posts