information

జీరో కాస్ట్ ఈఎంఐ అని ప్రచారం చేస్తున్నారు. అసలు వడ్డీ లేకుండా ఎవరైనా అప్పు ఎందుకు ఇస్తారు?

వడ్డీ లేకుండా అప్పు ఎవ్వరూ ఇవ్వరు. ఇందులో చాలా కోణాలు ఉన్నాయి. మొదటగా ,అస్సలు బ్యాంకులకి ఏంటి లాభం?? ఈ నో కాస్ట్ EMI లో మీరు గమనిస్తే బ్యాంకులు వడ్డీ ఛార్జ్ చేస్తాయి కానీ ఆ ఛార్జ్ చేసిన వడ్డీ తాలూకూ అమౌంట్ ఈ- కామర్స్ కమెనీల ద్వారా డిస్కౌంట్ రూపంలో ఇవ్వబడుతుంది అని క్లియర్ గా వ్రాసి వుంటుంది. సో ఇక్కడ బ్యాంకులకు/క్రెడిట్ కార్డు కంపెనీలకి తమ వడ్డీ వచ్చేస్తుంది. పైపెచ్చు కొన్ని సంస్థ లు ప్రాసెసింగ్ ఫీజు మరియు GST ఛార్జ్ చేస్తాయి. అవి అదనపు ఆదాయం. మరీ ముఖ్యం తరచూ వచ్చే ఈ ఆఫర్స్ కోసమే క్రెడిట్ కార్డు లు తీసుకునే బ్యాచు కి మన దేశం లో కొదువే లేదు. సో ఇక్కడ నీతో క్రెడిట్ కార్డు ద్వారా వ‌స్తువుల‌ని కొనిపించడం, నిన్ను వారి రెగ్యులర్ కస్టమర్ గా మలుచుకునే అవకాశం బ్యాంకులకు ఉంటుంది. తద్వారా క్రెడిట్ కార్డులతో ఆగకుండా పర్సనల్ లోన్ నుండి, కార్ లోన్, హోం లోన్ మొదలగు అన్నింటినీ ఆఫర్ చేస్తూ కాల్స్ వస్తాయి.

మరి ఈ – కామర్స్ సంస్థలకి ఏంటి లాభం??? ఈ డిస్కౌంట్ ల వల్ల e- కామర్స్ సంస్థలు కి నష్టం కదా… మరి వాటికి పిచ్చి పట్టి అలా చేస్తున్నాయా?? అలా అనుకుంటే మనమే పిచ్చోల్లమవుతాం. నిజానికి అవి ఎటువంటి డిస్కౌంట్ నీ ఇవ్వడం లేదు. ఉదా:- ఒక ఫోన్ విలువ రూ. 8000/- అయితే , అమ్మే విలువని రూ. 10000 అని చెప్పి, అందులో రూ. 1000/- డిస్కౌంట్ అని చెప్పి అమ్ముకుంటున్నాయి. సో ఎలా చూసినా వాటికి రూ. 1000/- లాభం. ఇదే సూత్రం దాదాపు అన్నీ ప్రొడక్ట్స్ కీ వర్తించుకుంటాయి…

how companies give no cost emi

వడ్డీ లేకుండా ఇస్తున్నామని లేదా అత్యధిక డిస్కౌంట్ ఇస్తున్నామని నమ్మకాన్ని కలిగిస్తూ కస్టమర్ తో మరిన్ని ప్రొడక్ట్స్ కొనేలా మైండ్ ని సిద్ధం చేయడం . కొన్ని ప్రొడక్ట్స్ కి నిజంగానే నష్టానికి పోయి మంచి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ నష్టం తాలూకు డబ్బు నీ మరో ప్రొడక్ట్ ని ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా భర్తీ చేస్తారు.

Admin

Recent Posts