Coconut Flower : సాధారణంగా మనలో చాలా మందికి కొబ్బరి బొండాం, కొబ్బరికాయ, కొబ్బరి నీళ్ల గురించి తెలుసు. కానీ కొబ్బరి పువ్వు గురించి చాలా మందికి తెలియదు. కొబ్బరికాయ లేదా కొబ్బరినీళ్ల వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. కొబ్బరి పువ్వు వల్ల కూడా మనకు అన్నే లాభాలు కలుగుతాయి. అయితే దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే కాస్త చేదుగా ఉంటుంది. కానీ.. కొబ్బరి పువ్వును తినడం వల్ల అనేక పోషకాలతోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇక కొబ్బరి పువ్వును తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి పువ్వులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే షుగర్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తాయి. వారు కొబ్బరి పువ్వును తింటే షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు. క్యాలరీలు తక్కువగా ఉంటాయి కనుక బరువు తగ్గాలనుకునే వారికి ఈ పువ్వు ఎంతగానో మేలు చేస్తుంది.
కొబ్బరి పువ్వును తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు తగ్గుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పువ్వులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక జీర్ణ సమస్యలు ఉండవు. అలాగే కిడ్నీల ఆరోగ్యం మెరుగు పడుతుంది. కిడ్నీ ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి కొబ్బరి పువ్వు ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే కొబ్బరి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. కనుక క్యాన్సర్ రాకుండా చూస్తాయి. కాబట్టి కొబ్బరి పువ్వును తరచూ తినాలి.
కొబ్బరి పువ్వును తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మానికి కావల్సిన తేమ లభిస్తుంది. దీంతో చర్మం మృదువుగా ఉంటుంది. అలాగే జుట్టు రాలకుండా చేసే గుణాలు కూడా ఈ పువ్వులో ఉంటాయి. దీంతోపాటు జుట్టు పెరుగుదల బాగుంటుంది. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు ఈ పువ్వును తింటే ఎంతో మేలు జరుగుతుంది. కనుక కొబ్బరి పువ్వును తరచూ తీసుకోవాలి. అయితే కొబ్బరి పువ్వు మనకు ఎక్కువగా ముదిరిపోయిన కొబ్బరికాయల్లో లభిస్తుంది. కనుక అలాంటి కాయలను వాడాల్సి ఉంటుంది. అప్పుడు కొబ్బరి పువ్వు లభిస్తుంది. దాన్ని తింటే పైన తెలిపిన విధంగా ప్రయోజనాలను పొందవచ్చు.