Liver Detox : మన శరీరంలోని అనేక అవయవాల్లో లివర్ కూడా ఒకటి. ఇది నిరంతరం అనేక విధులను నిర్వహిస్తుంటుంది. మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంతోపాటు మన శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. అలాగే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం గ్రహించేలా చేస్తుంది. ఇలా లివర్ ఎన్నో పనులు చేస్తుంది. అయితే మనం పాటించే జీవనశైలితోపాటు తీసుకునే ఆహారాల వల్ల లివర్ పనితీరు మందగిస్తుంటుంది. అలాంటప్పుడు పలు లక్షణాలు కనిపిస్తాయి.
లివర్ పనితీరు మందగించినప్పుడు లివర్ ఉన్న చోట నొప్పిగా ఉంటుంది. అలాగే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతోపాటు శరీరానికి శక్తి కూడా లభించదు. ఆకలి ఉండదు. ఈ లక్షణాలు కనిపిస్తుంటే లివర్ పనితీరు బాగా లేదని అర్థం. అలాంటప్పుడు కింద తెలిపిన విధంగా ఓ సహజసిద్ధమైన డ్రింక్‌ను తయారు చేసుకుని తాగడం వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది. దీంతోపాటు లివర్‌లో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్ శుభ్రంగా మారుతుంది. మరి లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని శుభ్రంగా కడిగిన కొత్తిమీర, పసుపు, కిస్మిస్ లను కొద్ది పరిమాణాల్లో వేసి మరగబెట్టండి. తర్వాత ఆ నీటిని జల్లెడతో వేరు చేసి గోరువెచ్చగా అయిన తర్వాత తాగండి. ఇలా తరచూ తీసుకుంటే శరీరంలోని విష పదార్థాలు బయటికి వెళ్లడంతోపాటు లివర్ సంబంధిత వ్యాధులు రావు. అలాగే లివర్ శుభ్రంగా మారుతుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. దీంతో అన్ని జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. అలాగే షుగర్ ఉన్నవారికి, లివర్ వ్యాధులు ఉన్నవారికి కూడా ఈ డ్రింక్ ఎంతగానో మేలు చేస్తుంది. కనుక దీన్ని తరచూ తీసుకోవాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.