Eggs In Fridge : కోడిగుడ్లు.. ఇవి ఎంతటి పౌష్టికహారామో మనందరికీ తెలిసిందే. తల్లిపాల తరువాత అంతటి పౌష్టికాహారమైనవి కోడిగుడ్లే. వీటిలో మన శరీరారినికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. కోడిగుడ్లను తినే వారు మాత్రం ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే. కోడిగుడ్డులోని పచ్చసొనను బట్టి అది పెట్టిన కోడి ఎలాంటి పౌష్టికాహారాన్ని తీసుకుందో ఇట్టే చెప్పవచ్చు.
గుడ్డు పచ్చసొన బాగా పసుపు రంగులో ఉంటే ఆ కోడి ఆకుపచ్చ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుందని అర్థం. అలా కాకుండా గుడ్డు పచ్చసొన సాధారణ పసుపు రంగులో ఉంటే ఆ కోడి మొక్కజొన్నలను తీసుకుందని అర్థం. అలాగే మనం కోడిగుడ్లను ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకుంటాం. ఫ్రిజ్ లో కోడిగుడ్లను నిల్వ చేసుకోవడానికి ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. కానీ ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లను తినడం వల్ల అనారోగ్యాల పాలవుతామని నిపుణులు చెబుతున్నారు.
గుడ్లను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల అవి పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. అంతేకాకుండా ఫ్రిజ్ లో నిల్వ చేయడం వల్ల సాల్మనెల్లా అభివృద్ధి చెందకుండా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ చేసిన కోడిగుడ్డు తెల్లసొన కంటే గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన కోడిగుడ్డు తెల్లసొన రుచికరంగా ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన గుడ్ల కంటే ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు త్వరగా కుళ్లిపోతాయి. అలాగే ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు కొద్దిగా పుల్లటి రుచిని కూడా కలిగి ఉంటాయి. కనుక గుడ్లను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిది.
గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన గుడ్లను.. ఫ్రిజ్ లో నిల్వ చేసిన గుడ్లను గమనించినప్పుడు ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు ఘనీభవనానికి గురి అయ్యి పెంకుపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత ఫ్రిజ్ లో నిల్వ చేసిన గుడ్లను తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుడ్లు క్యూటికల్స్ ను కలిగి ఉంటాయి. తాజా గుడ్లను ఫ్రిజ్ లో ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటిలో ఉండే క్యూటికల్స్ చెక్కుచెదరకుండా ఉంటాయి.
అలాగే గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన గుడ్లపై అభివృద్ధి చెందే సాల్మొనెల్ల ఒక గుడ్డు నుండి మరో గుడ్డుకు వ్యాప్తి చెందుతుంది. కానీ ఫ్రిజ్ లో ఉంచడం వల్ల అలా జరగకుండా ఉంటుంది. కోడిగుడ్లను ఫ్రిజ్ లో నిల్వ చేయడం కొంత లాభదాయకమే అయినా కొంత మంచిది కాదనే చెప్పవచ్చు. తాజా గుడ్లను రెండు రోజుల లోపల తినడమే మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.