Anemia : శరీరంలో రక్తం వేగంగా పెరగాలంటే.. వీటిని రోజూ తీసుకోవాలి..!

Anemia : మన శరీరంలో రక్తం తగినంత ఉండాల్సిందే. రక్తం తగినంత లేకపోతే రక్తహీనత సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపంతోపాటు మహిళలకు నెలసరి సమయంలో, గర్భం దాల్చినప్పుడు రక్తహీనత సమస్య వస్తుంటుంది. అయితే కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రక్తం త్వరగా తయారవుతుంది. మరి రక్తం పెరిగేందుకు ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

Anemia take these foods daily to quickly retain blood in no time Anemia take these foods daily to quickly retain blood in no time
Anemia

1. మన శరీరంలో రక్తం బాగా తయారు కావాలంటే ఐరన్‌ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పాలకూర, గోంగూర, పుట్టగొడుగులు, యాపిల్స్, టమాటాలు, బాదంపప్పు, పెసలు, జీడిపప్పు, సోయా, కిస్మిస్‌, డార్క్‌ చాకొలెట్‌, యాలకులు, విత్తనాలు, గుడ్లు, చికెన్, మటన్‌, చేపలు.. వంటి ఆహారాల్లో మనకు ఐరన్‌ అధికంగా లభిస్తుంది. అలాగే బీట్‌రూట్‌లోనూ అధికంగా ఐరన్‌ ఉంటుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.

2. రోజూ పాలకూర, క్యారెట్‌, బీట్‌రూట్‌, యాపిల్‌ వంటి కూరగాయలు, పండ్లతో తయారు చేసిన జ్యూస్‌లను తాగుతుంటే రక్తం త్వరగా తయారవుతుంది.

3. రోజూ ఉదయాన్నే పరగడుపునే అరకప్పు బీట్‌రూట్‌ జ్యూస్‌, అర కప్పు ఉసిరికాయ జ్యూస్‌.. రెండింటినీ కలిపి కప్పు మోతాదులో తాగాలి. దీంతో రక్తం వేగంగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడతారు.

4. రోజూ మధ్యాహ్నం సమయంలో ఒక గ్లాస్‌ దానిమ్మ పండు రసం తాగాలి. లేదా రోజుకు ఒక దానిమ్మ పండును తినాలి. ఇవి రక్తాన్ని పెంచేందుకు తోడ్పడుతాయి.

5. రాత్రిపూట మజ్జిగలో కొద్దిగా కరివేపాకు పొడి కలిపి తాగడం వల్ల కూడా రక్తం తయారవుతుంది.

6. విటమిన్‌ బి12 వల్ల కూడా రక్తం తయారవుతుంది. కనుక విటమిన్ బి12 అధికంగా ఉండే చేపలు, గుడ్లు, పుట్టగొడుగులు, మటన్‌ లివర్‌ వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇవన్నీ రక్తాన్ని పెంచుతాయి. రక్తహీనత నుంచి బయట పడేస్తాయి.

Admin

Recent Posts