Bigg Boss : బిగ్ బాస్ కంటెస్టెంట్లు దీప్తి సునైన, షణ్ముఖ్ లు బ్రేకప్ చెప్పుకున్నప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక వార్త వారి గురించి వైరల్ అవుతూనే ఉంది. తాజాగా వాలెంటైన్స్ డే సందర్బంగా వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాలేదు. ఈ క్రమంలోనే ప్రేమికుల దినోత్సవం రోజు దీప్తి సునైన పరోక్షంగా షణ్ముఖ్‌ను టార్గెట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఇలా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు పరోక్షంగా పోస్టులు పెట్టుకుంటూ కోల్డ్ వార్ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే తాము ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ? అన్న విషయాన్ని షణ్ముఖ్ తాజాగా వెల్లడించాడు.
తాజాగా షణ్ముఖ్.. తాను దీప్తి సునైనతో ఎందుకు విడిపోయాడో చెప్పుకొచ్చాడు. అందుకు చాలా కారణాలే ఉన్నాయని తెలిపాడు. దీప్తి, తాను విడిపోవడానికి సిరి కారణం కాదని, సిరిని నిందించాల్సిన అవసరం లేదని అన్నాడు. తాము విడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అన్నాడు. తన వల్ల దీప్తి ఎక్కువ నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చిందని, అయితే దీప్తి, సిరి మంచి స్నేహితులని.. కనుక దీప్తి, తాను విడిపోయేందుకు సిరి కారణం కాదని తెలిపాడు.
బిగ్ బాస్ ఇంట్లో సిరి తనకు చాలా సపోర్ట్‌ను ఇచ్చిందని షణ్ముఖ్ తెలియజేశాడు. అయితే దీన్ని పట్టించుకోకుండా సిరి అమ్మ తనను తప్పుగా అర్థం చేసుకుందని విచారం వ్యక్తం చేశాడు. ఇక బిగ్ బాస్ ఇంట్లో తాము ఇద్దరం చనువుగా ఉండడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు చేశారని, దీప్తి, తాను విడిపోయేందుకు ఇదొక కారణమని అన్నాడు. దీప్తితో తాను చనువుగా ఉండడం ఆమె కుటుంబానికి నచ్చలేదని, దీంతో ఆమెపై ఒత్తిడి పెరిగిందని, ఈ క్రమంలోనే తాము విడిపోయామని.. ఇది కూడా తాము విడిపోయేందుకు ఉన్న కారణాల్లో ఒకటని తెలిపాడు. ఇరు కుటుంబాల ఒత్తిడి తమ మధ్య చిచ్చు రగిలించిందని షణ్ముఖ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా యూట్యూబ్ వీడియోలతో దీప్తి సునైన, షణ్ముఖ్ ఇద్దరూ ఎంతో పేరు తెచ్చుకున్నారు. దీప్తి బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొనగా.. షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొని రన్నరప్‌గా నిలిచాడు. బిగ్ బాస్ ఇంట్లో షణ్ముఖ్, సిరిల ప్రవర్తన వల్ల దీప్తి మీద ఆమె కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారని, అందుకనే ఆమె షణ్ముఖ్‌తో బ్రేకప్ చేసుకుందని స్పష్టమైంది. అయితే భవిష్యత్తులో వీరు కలుస్తారా.. లేదా.. అన్నది ఆసక్తికరంగా మారింది.