Taapsee : నటి తాప్సీకి ఘోర అవమానం.. దర్శకుడు అసభ్యకరమైన కామెంట్లు..

Taapsee : ఇటు టాలీవుడ్‌తోపాటు అటు బాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె 2010లో తెలుగులో ఝుమ్మంది నాదం అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. మంచు మనోజ్‌ హీరోగా నటించారు. తాను నటించిన మొదటి సినిమాలోనే తాప్సీ ఒక రేంజ్‌లో అందాలను ఆరబోసి పాపులర్‌ అయింది. తరువాత పలు హిట్‌ చిత్రాల్లో నటించింది. అయితే ఈమె ప్రస్తుతం కమర్షియల్‌ చిత్రాలను ఎక్కువగా చేయడం లేదు. కథాబలం ఉన్న చిత్రాలతోపాటు లేడీ ఓరియెంటెడ్‌ మూవీల్లోనే నటిస్తోంది.

Taapsee insulted by that director during that film making
Taapsee

ఇక ఇటీవలే తాప్సీ నటించిన లూప్‌ లపేటా అనే మూవీ నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయింది. అయితే ఈ మూవీ విశేషాలను తాప్సీ తాజాగా ఓ మీడియా సంస్థతో పంచుకుంది. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ.. లూప్‌ లపేటా సినిమా షూటింగ్‌ సమయంలో తనకు ఘోర అవమానం జరిగిందని తెలియజేసింది. ఓ సీన్‌లో నటించేటప్పుడు దర్శకుడు అసభ్యకరమైన కామెంట్లు చేశాడని ఆరోపించింది.

లూప్‌ లపేటా సినిమాలో తాప్సీ హీరో తాహిర్‌కు లిప్‌లాక్‌ ఇస్తుంది. అయితే ఈ సీన్‌ను షూటింగ్‌ చేసే సమయంలో దర్శకుడు ఆకాష్‌ భాటియా తనపట్ల అసభ్యకరమైన కామెంట్లు చేశాడని తాప్సీ పేర్కొంది. ముద్దు సీన్‌ స్టార్ట్‌ అవగానే తాను, తాహిర్‌ లిప్‌లాక్‌లో ఉన్నామని.. అయితే దర్శకుడు ఆకాష్‌ రన్నింగ్‌ కామెంట్రీ చెప్పాడని తెలిపింది. తమ ముద్దు సీన్‌ పూర్తి కాకుండానే ఆకాష్‌ పలు కామెంట్లు చేశాడని, తాను సీన్‌ పూర్తి అయ్యేంత వరకు మాట్లాడుతూనే ఉన్నాడని తెలియజేసింది.

తాను, తాహిర్‌ ముద్దు సీన్‌ను మొదలు పెట్టగానే.. ఆకాష్‌.. ఓకే మొదలు పెట్టండి, నైస్‌గా మాట్లాడుకోండి, మీ చేతులను ఒకరివి మరొకరు పట్టుకోండి, ఇప్పుడు ముద్దు పెట్టుకోండి, ఆ ముద్దు ఎలా ఉండాలంటే, ఒకరికొకరు స్విచ్‌ ఆన్‌ అయ్యేట్లుగా ఉండాలి, తాహిర్‌.. ఇలాంటి అమ్మాయిని నువ్వు ఇంతకు ముందు ఎప్పుడూ ముద్దు పెట్టుకోలేదేమో, కనుక దొరికిన చాన్స్‌ను మిస్‌ చేసుకోకు, ఇలాంటి అమ్మాయి మళ్లీ లభిచదు.. అని దర్శకుడు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని.. తాప్సీ తెలియజేసింది.

కాగా లూప్‌ లపేటా సినిమాను 1998లో వచ్చిన జర్మన్‌ మూవీ రన్‌ లోలా రన్‌ అనే సినిమాకు రీమేక్‌గా రూపొందించారు. ఇందులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌ను ఓ యువతి ఎలా కాపాడుకుంది.. అన్న కథాంశాన్ని చూపించారు.

Editor

Recent Posts