Barley Seeds Java : ఈ జావ తాగితే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

Barley Seeds Java : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో జావ‌ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చక్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. ఈ జావ‌ను తాగ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు మన ద‌రి చేరుకుండా ఉంటాయి. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. ఈ జావ‌ను తాగ‌డం వ‌ల్ల నేటి త‌రుణంలో మ‌న‌ల్ని వేధిస్తున్న అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుండి మ‌న‌కు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మ‌న‌కు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ జావ‌ను అస‌లు ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి. అలాగే ఈ జావ‌ను ఎలా తీసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జావ‌ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ఒక క‌ప్పు బార్లీ గింజ‌ల‌ను, ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర‌ను, ఒక టీ స్పూన్ మిరియాల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది.

ముందుగా క‌ళాయిలో బార్లీ గింజ‌లు, మిరియాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పొడిలా త‌యారు చేసుకోవాలి. ఈ పొడిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇప్పుడు జావ‌ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత జావ పిండిని ఒక టీ స్పూన్ మోతాదులో వేసి క‌ల‌పాలి. దీనిని ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ జావ గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత తాగాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌ది రోజుల పాటు తాగాలి. త‌రువాత వారం రోజులు గ్యాప్ ఇచ్చి మ‌ర‌లా ప‌ది రోజులు తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్ ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ జావ‌ను తాగ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి.

Barley Seeds Java how to make it and benefits
Barley Seeds Java

ఆర్థోపోరోసిస్, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. దీనిని తాగ‌డం వ‌ల్ల సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. మూత్ర‌పిండాల ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి కావ‌ల్సినంత శ‌క్తి ల‌భిస్తుంది. నీర‌సం, బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే ఈ జావ‌ను తాగ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. అంతేకాకుండా ఈ జావ‌ను తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. బార్లీ గింజ‌ల్లో, మిరియాలల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఈ విధంగా బార్లీ గింజ‌లతో జావ‌ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts