హెల్త్ టిప్స్

బీర్ తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

హాట్ హాట్‌గా ఉన్న వాతావ‌ర‌ణంలో ఒక చ‌ల్ల‌ని బీర్ కొడితే ఎలా ఉంటుంది? ఆ మ‌జాయే వేరు క‌దా! అవును, మ‌రి. మ‌జాగానే ఉంటుంది. అయితే దాని టేస్ట్ తెలిసిన వారికే ఆ మ‌జా అందుతుంది. లేదంటే అంద‌దు. అంటే డ్రింకింగ్‌ అల‌వాటు ఉన్న‌వారైతేనే బీర్ టేస్ట్‌ను ఎంజాయ్ చేయ‌గ‌లుగుతార‌ని అర్థం. కానీ మోతాదుకు మించి తాగితే బీర్‌తోనూ అన‌ర్థాలు త‌ప్ప‌వు. హ్యాంగోవ‌ర్ మొద‌లు కొని లివ‌ర్ చెడిపోవ‌డం, హార్ట్ స‌మ‌స్య‌లు, క్యాన్స‌ర్ వంటివి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఆరోగ్యంగా ఉన్న మ‌గ లేదా ఆడ మ‌నిషి రోజుకు 12 ఔన్సుల (దాదాపు 350 ఎంఎల్‌) మోతాదులో బీర్ తాగితే దాంతో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బీర్‌లో పాలీఫినాల్స్ అన‌బ‌డే ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. బీర్‌ను త‌గిన మోతాదులో సేవిస్తే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గ‌డంతోపాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతోపాటు బీర్ ర‌క్త నాళాల‌ను గ‌ట్టి ప‌డ‌కుండా చూస్తుంది. ర‌క్తం గడ్డ‌క‌ట్ట‌కుండా కాపాడుతుంది. దీని వ‌ల్ల హార్ట్ ఎటాక్స్ వంటివి వ‌చ్చేందుకు అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది. హార్వ‌ర్డ్ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ వారు చేసిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం బీర్‌ను త‌గిన మోతాదులో నిత్యం తీసుకుంటే గుండె సంబంధ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం 20 నుంచి 40 శాతం వ‌ర‌కు త‌గ్గుతుందట‌. బీర్‌ను త‌ర‌చూ తాగుతుంటే కిడ్నీల‌లో రాళ్లు ఏర్ప‌డే అవ‌కాశం కూడా త‌గ్గుతుంద‌ట‌. ఫిన్‌లాండ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేసిన ప్ర‌యోగాల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది. అంతేకాకుండా శ‌రీరంలోని విష ప‌దార్థాలు కూడా బ‌య‌టికి వెళ్లిపోతాయ‌ట‌. ప్ర‌ధానంగా కాల్షియం పేరుకుపోవ‌డం వ‌ల్ల ఏర్ప‌డే కిడ్నీ రాళ్ల‌ను అడ్డుకోవ‌డంలో బీర్ ముఖ్య పాత్ర పోషిస్తుంద‌ట‌.

beer drinking health benefits

రష్ యూనివ‌ర్సిటీ మెడిక‌ల్ సెంట‌ర్ వారు చేసిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం త‌ర‌చూ బీర్ తాగుతుంటే జ్ఞాప‌క‌శ‌క్తి సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు 23 శాతం వ‌రకు తగ్గుతాయ‌ట‌. అంతేకాదు బీర్ తాగ‌డం వ‌ల్ల మెద‌డులో కొత్త క‌ణాలు వృద్ధి చెందుతూ జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త, రీజ‌నింగ్ ప‌వ‌ర్ వంటివి పెరుగుతాయ‌ట‌. వృద్ధాప్యంలో అల్జీమ‌ర్స్‌, దెమెంతియా వంటి వ్యాధులను రాకుండా చూసుకోవ‌చ్చ‌ట‌. బీర్ల‌లో సిలికాన్ ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఇది ఎముక‌ల పోష‌ణకు ఎంత‌గానో అవ‌స‌ర‌మ‌వుతుంద‌ట‌. కాబ‌ట్టి బీర్‌ను తాగితే అందులోని సిలికాన్ వ‌ల్ల ఎముక‌ల‌కు బ‌లం చేకూరుతుంది. 2009లో టఫ్ట్స్ యూనివ‌ర్సిటీ చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం తెలిసింది. బీర్‌లో క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడే ఔష‌ధ గుణాలు ఉన్నాయి. త‌గిన మోతాదులో బీర్‌ను తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం కూడా త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌.

బీర్ల‌లో ఉండే ఆల్క‌హాల్ ఇన్సులిన్ సెన్సిటీవిటీని అధికం చేస్తుంద‌ట‌. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ట‌. 2011లో హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేసిన ఓ రీసెర్చి ప్ర‌కారం త‌ర‌చూ త‌గిన మోతాదులో బీర్ల‌ను తాగుతున్న వారిలో టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు 25 శాతం వ‌ర‌కు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ట‌. బీర్ల‌లో ఉండే సాల్యుబుల్ ఫైబ‌ర్ డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు చేస్తుంద‌ట‌. నిత్యం త‌గినంత బీర్‌ను తాగితే ఎప్ప‌టికీ య‌వ్వ‌నంగా క‌నిపిస్తార‌ట‌. వృద్ధాప్య ఛాయ‌ల కార‌ణంగా వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయ‌ట‌. ప్రాచీన కాలంలో ఈజిప్షియ‌న్లు ఎక్కువ‌గా బీర్‌తో స్నానం చేసేవార‌ట‌. దీంతో వారు ఎక్కువ యంగ్‌గా క‌నిపించేవార‌ట‌. బీర్‌లో విట‌మిన్ బి, ఈస్ట్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి. దీని వల్ల బీర్ వెంట్రుక‌ల‌కు ఆరోగ్యాన్నిస్తుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెర‌గ‌డంలో బీర్ ఉపయోగ‌ప‌డుతుంది.

Admin

Recent Posts